ప్రపంచకప్ లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లోను టీమ్ ఇండియా జయకేతనం ఎగరేసింది. ప్రపంచకప్ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. కీలక సెమీస్ పోరులో భారత్ న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో గత వరల్డ్ కప్ సెమీస్ పరాజయానికి ఇప్పడు బదులు తీర్చుకున్నట్లైంది. అయితే వరుసగా మూడోసారి ఫైనల్ చేరుదామనుకున్న కివీస్ ఆశలు ఇసారి ఫలించలేదు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ పరాజయంతో న్యూజిలాండ్ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించింది. మహ్మద్ షమీ (7/57) వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. షమీ దెబ్బకు కివీస్ విలవిలలాడింది. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసి భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు.
Sports
విశాఖ:
ఈనెల 23 న విశాఖలో ఏసిఏ , వీడిసిఏ స్టేడియంలో Ind vs Aus t20 మ్యాచ్ కు రంగం సిద్ధం అయ్యింది అని డిసిపి -1 కే. శ్రీనివాసరావు తెలియజేసారు.
ఏసిఏ- విడిసిఏ స్టేడియం బి గ్రౌండ్,మున్సిపల్ స్టేడియం, గాజువాకలో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్ టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆఫ్ లైన్ లో ఒక్కొరికి రెండు టిక్కెట్లు మాత్రమే, కలెక్టర్ గారు అనుమతి తో రెవెన్యూ అధికారులు సమక్షంలో పారదర్శకంగా టికెట్లు విక్రయిస్తారు. రేపటి నుంచి రెండు రోజులు ఆన్ లైన్ లో 10,500 వరకూ టిక్కెట్లు విక్రయాలు. 17,18 తేదీల్లో ఆఫ్ లైన్ లో 11,500 టిక్కెట్లు పేటిఎం ఇంసైడేర్ వెబ్ సైట్ లో విక్రయాలు..బీసీసీఐ షరతులు విధంగా కాంప్లిమెంట్లు 5,300..టికెట్లు జారీ చేస్తాం అని తెలిపారు ఏసీఏ సెక్రెటరీ గోపీనాధ్ రెడ్డి
1500 మంది పోలీసులతో బందోబస్తు, ఇతర జిల్లాలు మరియు స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఉంటారని, మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో సీట్లలోకి చేరుకోవాలి. మ్యాచ్ పూర్తయ్యాక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలి. ఒకసారి స్కాన్ అయ్యాక తరిగి లోపలికి అనుమతించబడరు. టికెట్స్ కలర్ జిరెక్స్ లు తీసి ఎవరికైనా విక్రయిస్తే కఠినమైన చర్యలు..వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించాము..బౌన్సర్లు కి అనుమతి ఇచ్చే ముందు వారి క్రిమినల్ డేటా పరిశీలించి అనుమతి ఇస్తాము..బయట వ్యక్తులకు స్టేడియంలో అనుమతి కావాలంటే స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ఎంక్వేరి చేసి ఐడి కార్డు జారీ చేస్తామని ఆయన తెలిపారు…
భారత్ గెలవకపోవడం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.ఈ ప్రపంచకప్‌లో అజేయంగా కొనసాగిన టీమ్ ఇండియాకు వాంఖడే స్టేడియం రికార్డులు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వాంఖడే వేదికగా ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్‌లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణం. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే మైదానంలో రేపు నవంబర్ 15న టీమిండియా న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టనుందా?
మార్కాపురం పట్టణంలోని వైయస్సార్ క్రీడా వికాస కేంద్రం నందు నవంబర్ 14వ తేదీ చిల్డ్రన్స్ డే సందర్భంగా అండర్ 15 బ్యాట్మెంటన్ టోర్నమెంటు మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పాల్గొని, ఆటల పోటీలను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు….అనంతరం ఎమ్మెల్యే క్రీడాకారులతో బ్యాట్మెంటన్ ఆడి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాల అధిరోహించడానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, అన్నారు. అదేవిధంగా మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నెలకొల్పేందుకు, క్రీడలను ప్రోత్సహించేందుకు మార్కాపురం స్పోర్ట్స్ అండ్ యోగా క్లబ్, అన్నివేళలా ముందుంటుందని, విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గమనించి వారికి ప్రోత్సాహం అందించాలని జిల్లా స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ క్రీడల్లో రాణించి తల్లిదండ్రులకు ఊరికి మంచి పేరు తీసుకురావాలని, అన్నారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ శ్రీనివాస్, కౌన్సిలర్ నాగేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారులు రాందాస్ నాయక్, శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పలు పాఠశాలల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also..
వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు. బెంగళూరులోని ఓ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య, కూతురుతో కలిసి పాల్గొన్నారు. ఇక విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క ఈ వేడుకల్లో సందడి చేశారు. ఆటగాళ్లంతా సంప్రదాయబద్ధంగా కుర్తీ, పైజామాలతో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో భారత జట్టు తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. దీంతో భారత జట్టు సభ్యులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. శనివారం దీపావళి వేడుకలను హోటల్ లోనే ఘనంగా జరుపుకున్నారు. జట్టులోని ప్లేయర్లతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర టీంమెంబర్లు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం కనిపిస్తోందంటూ… లంక క్రికెట్ బోర్డును ఐసీసీ తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.ఓ సభ్య దేశంగా ఐసీసీ నియమావళిని శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్రస్థాయిలో ఉల్లంఘించిందని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ సభ్య దేశాల క్రికెట్ బోర్డుల్లో ప్రభుత్వ, రాజకీయ జోక్యం ఉండరాదన్న నిబంధనను శ్రీలంక క్రికెట్ అతిక్రమించిందని వివరించింది. స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవడంలో విఫలమైందని తెలిపింది. ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేటు వేస్తున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ తాజా చర్యలకు బలమైన కారణమే ఉంది. వరల్డ్ కప్ టోర్నీలో శ్రీలంక జట్టు దారుణ ప్రదర్శన కనబర్చింది. 9 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దాంతో టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. ముఖ్యంగా, టీమిండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. ఆసియా కప్ ఫైనల్లో ఎలా కుప్పకూలిందో, వరల్డ్ కప్ లోనూ టీమిండియా బౌలర్ల ధాటికి కకావికలమైంది. దాంతో శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యలందరిపైనా ఆ దేశ క్రీడల మంత్రి రోషన్ రణసింఘే వేటు వేశారు. బోర్డు తాత్కాలిక పాలనాధ్యక్షుడిగా మాజీ సారథి అర్జున రణతుంగను నియమించారు. ఈ అంశమే ఐసీసీ ఆగ్రహానికి కారణమైంది.
ఆదిత్య విద్యా ప్రాంగణంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ(పురుషులు) టోర్నమెంట్ 2023 ఉత్సహపూరిత వాతావరణంలో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9,10,11,12 తేదీల్లో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు దక్షిణాది ఆరు రాష్ట్రాలకు చెందిన 113 యూనివర్సిటీలకు చెందిన 95 టీమ్ లు, సుమారు 1200 మంది ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొని మార్చ్ పాస్ట్ నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి. శ్రీమతి ఆర్.కె.రోజా గౌరవ వందనం స్వీకరించారు. జె.ఎన్.టి.యు.కె మరియు ఆదిత్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైస్ చాన్సలర్ ప్రో.జి.వి.ఆర్.ప్రసాద్ రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రో. హేమచంద్రారెడ్డి, నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె.పద్మ రాజు, ఇండియన్ యూనివర్సిటీస్ జాయింట్ సెక్రటరీ డా. బల్జీత్ సింగ్ సేఖోన్ ఆదిత్య విద్యాసంస్థల అధినేత డా. నల్లమిల్లి శేషారెడ్డి,వైస్ చైర్మన్ డా నల్లమిల్లి సతీష్ రెడ్డి, ఎన్.వి.రమణ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఇజ్జపురెడ్డి ప్రసాదరావు(కబాడ్డి రావు), ప్రో.ఎన్.సుమలత, డా . జి.వి.రాజు, శ్యామ్, తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జి . వి.ఆర్. ప్రసాదరాజు కార్యక్రమం యొక్క నిర్వాహకులకు, క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రసాద రావు మాట్లాడుతూ భారతదేశంలో క్రికెట్ తర్వాత అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రీడ కబడ్డీ అని అన్నారు. కబడ్డీ అనేది భారతీయ సంస్కృతిలో భాగం అని ఈ క్రీడకు ప్రభుత్వం తరుపున ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి రోజా ను కోరారు. ప్రో.హేమచంద్ర రెడ్డి మాట్లాడుతూ జే. ఎన్ టి యూ కే నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు ఆదిత్య విద్యా సంస్థల చేరికతో వేరే లెవెల్ కు కలర్ ఫుల్ ఈవెంట్ గా మారిపోయాయి అని అన్నారు.సంయుక్త ముఖ్య అతిథి గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి.ఆర్.కే.రోజా మాట్లాడుతూ ప్రో కబడ్డీ స్థాయిలో ఆదిత్య యాజమాన్యం చేసిన ఏర్పాట్లుతో ఈ పోటీలకు మరింత స్థాయికి చేర్చారు. కబడ్డీ చిన్నతనం నుండి ఎంతో ఇష్టం అని ఆటలో గెలిస్తెనే చరిత్రలో ఉంటామని అలా చరిత్ర సృష్టించడానికి వందశాతం ప్రయత్నించాలని అన్నారు.గెలుపు ఓటమి రెండూ మూడక్షరాలే అయితే గెలుపు ఇచ్చే కిక్ వెరే లెవెల్ అని అన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎందరో క్రీడాకారులు చరితలో నిలిచారని అలా మీరు కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అందుకు ఇటువంటి వేదికలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న సంగతి వివరించారు.డిసెంబర్ లో రాష్ట్ర మంతటా ఆడుదాం ఆంధ్రా పేరిట ప్రతీ సచివాలయం పరిధిలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయి అన్నారు. అనంతరం బెలూన్లు వదిలి పోటీలను ప్రంభిస్తున్నట్లుప్రకటించి స్వయంగా కబడ్డీ ఆడి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్ కె రోజా చేతులమీదుగా “కబడ్డీ” పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఆదిత్య యాజమాన్యం తరుపున ఎన్.శ్రుతి రెడ్డి, డా . ఎన్. సుగుణ రెడ్డి మంతి రోజాను ఘనంగా సన్మానించారు.
(IND vs SA) ప్రతీ ఆటగాడు మంచి ఫామ్ లో ఉన్నాడు- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా ఉంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాపై 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో అతను సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.
అయితే, కోహ్లీ సెంచరీ కంటే రోహిత్ శర్మ చేసిన 40 పరుగులే కీలక పాత్ర పోషించాయి. ఒకరకంగా చెప్పాలంటే కోహ్లీ సెంచరీని అధిగమించేలా ఉంది రోహిత్ స్వల్ప ఇన్నింగ్స్.
ఈ విజయంతో భారత్ వన్డే ప్రపంచ కప్‌లో అజేయంగా వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లో గెలిచింది.
ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
భారత క్రికెట్ జట్టు ఈ విజయాన్ని కొనసాగిస్తూ ప్రపంచ కప్‌ను గెలుచుకోవాలని ఆశిద్దాం.
భారత్‌పై ఘోర ఓటమితో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం, మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన క్రీడల మంత్రిత్వ శాఖ.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో తమ జట్టు ప్రదర్శనపై శ్రీలంక క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల భారత్ తో జరిగిన మ్యాచ్ లో అవమానకర రీతిలో ఓడిపోవడంపై సీరియస్ అయ్యారు. దిద్దుబాటు చర్యలు చేపట్టిన మంత్రి.. మొత్తం క్రికెట్ బోర్డునే తొలగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి మధ్యంతర బోర్డును ఏర్పాటు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.1996 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు నేతృత్వం వహించిన అర్జున రణతుంగను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. ఈ ప్యానెల్ లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, క్రికెట్ బోర్డు మాజీ ప్రెసిడెంట్ సహా ఏడుగురు సభ్యులను నియమించారు. ఇండియాతో జరిగిన మ్యాచ్ లో ఘోర వైఫల్యం తర్వాత మంత్రి రోషన్ రణసింఘె క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు.శ్రీలంక క్రికెట్ బోర్డ్ అవినీతితో నిండిపోయిందని ఆరోపించారు. బోర్డ్ ప్రెసిడెంట్ తో పాటు సభ్యులకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. వరల్డ్ కప్ టోర్నీలో జట్టు వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా బోర్డు మొత్తాన్ని తొలగిస్తూ మంత్రి రోషన్ రణసింఘె ఉత్తర్వులు జారీ చేశారు.
బంగ్లాదేశ్: ప్రపంచ కప్‌లో నేడు ఎలాంటి ప్రాధాన్యత లేని మ్యాచ్… టాస్ గెలిచిన బంగ్లాదేశ్.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. టీమిండియా, దక్షిణాఫ్రికా సెమీస్ చేరాయి. ఇక మిగిలింది రెండు బెర్తులు… ఈ రెండు బెర్తుల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు రేసులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, టోర్నీలో నేడు ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందన్న నివేదికల నేపథ్యంలో, ఈ మ్యాచ్ జరగడంపై అనిశ్చితి నెలకొంది. అయితే, మ్యాచ్ జరిపేందుకే ఐసీసీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.




Total views : 194111