షాన్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బౌరం పెట్ లోని ఆర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలతో కలిసి టూన్ ఫెస్ట్ ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని గీతా మాధురి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్కీడ్స్ స్కూల్ పిల్లలతో కలిసి ఆట పాటలతో సందడి చేశారు షాన్ కేర్ ఫౌండేషన్ నిర్వాహకులు. అర్కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లల చదువు తో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని చైతన్య వంతులు గా కావాలని ఆకాంక్షించారు. పిల్లల్లో ఉండే ట్యాలెంట్ ను బైటికి తీసేందుకు షాన్ కేర్ ఫౌండేషన్ లాంటి సంస్థలు సపోర్ట్ చేయడం చాలా సంతోషం గా ఉందని అన్నారు.
Sports
పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు శుక్రవారం తన రిటైర్మెంట్ను ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు. ‘‘ ఈ మధ్య నా అంతర్జాతీయ క్రికెట్ గురించి ఆలోచించుకున్నాను. వీడ్కోలు పలికేందుకు ఇదే తగిన సమయమని నిర్ణయించుకున్నాను. వన్డే, టీ20 ఫార్మాట్లో ఆడిన 121 మ్యాచ్‌లలో ప్రతి ఒక్కటి నా కలలను సాకారం చేశాయి. పాకిస్థాన్ క్రికెట్ కోచ్‌లు, నాయకత్వంతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. ఇందులో భాగస్వామ్యం అయ్యే ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకుంటున్నాను. పాక్ జట్టు రాణించడం కోసం నేను ఎదురు చూస్తుంటాను’’ ఎక్స్‌లో ఇమాద్ రాసుకొచ్చాడు. పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం నిజంగా గౌరవంగా ఉందని, ఏళ్లపాటు మద్దతు ఇచ్చిన పీసీబీకి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు. అయితే అంతర్జాతీయేతర ఆటగాడిగా తన క్రికెట్ కెరియర్‌పై దృష్టి సారిస్తానని ఇమాద్ చెప్పాడు. కాగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన ఇమాద్ 55 వన్డేల్లో 42.86 సగటుతో 986 పరుగులు చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్‌తో 44 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక 66 టీ20ల్లో 486 పరుగులు, 65 వికెట్లు తీశాడు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌పై ఆడిన టీ20 చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా ఉంది. కాగా మే 2015లో జింబాబ్‌పై టీ20 మ్యాచ్‌తో ఇమాద్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొదలైంది.
రాష్ట స్థ్రాయి బాల బాలికల కబాడీ పోటీలను చౌడేపల్లి లో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి కబ్బడి పోటీల ను చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కబాడీ సంఘం అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో జరగనున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు 13 జిల్లాల బాల బాలికలు పాల్గొంటారని నిర్వాహకులు, పాఠశాల పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కబాడీ పోటీలను చిత్తూరు జిల్లా ఎం.పి.రెడ్డెప్ప ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా కార్యదర్శి పెద్దిరెడ్డి ,ఎం.పి.పి.రామ్మూర్తి, జెడ్పిటిసి దామోదర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాతో విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 2 వికెట్లతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 80, ఇషాన్ కిషన్ 58 పరుగులతో రాణించగా, ఆఖర్లో రింకూ సింగ్ 22 పరుగులతో నాటౌట్ గా కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ చివరి బంతి వరకు సాగినా రింకూ సింగ్ పవర్ హిట్టింగ్ తో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాల్సి ఉండగా టీమిండియా 3 వికెట్లు చేజార్చుకుంది. అక్షర్ పటేల్ బంతిని గాల్లోకి కొట్టి బౌలర్ అబ్బాట్ కే క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికే రవి బిష్ణోయ్ రనౌట్ అయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన స్థితిలో, అర్షదీప్ రనౌట్ కావడంతో, చివరి బంతికి 1 పరుగు కావాల్సి వచ్చింది. క్రీజులో ఉన్న రింకూ సింగ్ బలంగా కొట్టిన షాట్ నేరుగా స్టాండ్స్ లో పడింది. కేవలం 1 పరుగు అవసరమైన ఆ దశలో రింకూ సిక్స్ కొట్టినప్పటికీ, అది నోబాల్ కావడంతో ఆ 6 పరుగులు స్కోరుకు జతకలవవు. నోబాల్ కు వచ్చిన ఎక్స్ ట్రాతోనే టీమిండియా విజయం సాధించినట్టయింది. రింకూ 14 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు.5 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఈ నెల 26న తిరువనంతపురంలో జరగనుంది.
ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగబోవు టి20 మ్యాచ్ కి విశాఖపట్నం వైయస్సార్ క్రికెట్ స్టేడియం ముస్తాబయింది. వెయ్యి మందితో స్టేడియం చుట్టూ ప్రహరకాస్తు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, బాంబ్ స్కాడ్ , ఆర్మ్డ్ డ్ రిజర్వ్ టీమ్స్ సంసిద్ధంగా ఉన్నాయి. క్రికెట్ అభిమానులందరూ ఎటువంటి తినుబండారాలు,వాటర్ బాటిల్స్ స్టేడియంలోకి తీసుకురాకూడదని, ట్రాఫిక్ పరంగా అన్ని విధాల డైవర్షన్స్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు తో మా విశాఖపట్నం కరస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్…
వరల్డ్ కప్ లో ఘోర వైఫల్యం చెందడంతో శ్రీలంక క్రికెట్ బోర్డును ఆ దేశ క్రీడల మంత్రి రద్దు చేయడం తెలిసిందే. దాంతో, క్రికెట్ బోర్డులో రాజకీయ, ప్రభుత్వ జోక్యం తమ నిబంధనలకు విరుద్ధమంటూ ఐసీసీ శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 వరల్డ్ కప్ వేదిక మారింది. అండర్-19 వరల్డ్ కప్ ను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలిస్తున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పురుషుల విభాగంలో 15వ అండర్-19 వరల్డ్ కప్ వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుందని తెలిపింది. ఐసీసీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే అండర్-19 వేదిక మార్పు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ ఉన్నప్పటికీ… శ్రీలంక జట్టు అంతర్జాతీయ క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు, ఐసీసీ టోర్నీల్లో పాల్గొనవచ్చని ఊరట కలిగించే నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డుకు లభించే నిధులను ఇకపై ఐసీసీ నియంత్రిస్తుంది.
ఓటమన్నదే ఎరుగకుండా వరల్డ్ కప్ ఫైనల్ వరకు దూసుకొచ్చి, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియాపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దీన్ని దురదృష్టంగానే భావించాలని సూచించాడు. టోర్నీ అంతటా అద్భుతంగా ఆడాక, చివరికి ఒక్క మ్యాచ్ లో అదృష్టం ముఖం చాటేస్తే హృదయం బద్దలవుతుందని పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఆవేదనను అర్థం చేసుకోగలను. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఓటములన్నది ఆటలో భాగం. ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి… టీమిండియా ఈ టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది అని సచిన్ ఓదార్పు వచనాలు పలికారు. వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా జట్టుకు సచిన్ అభినందనలు తెలిపారు. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్. వరల్డ్ కప్ వంటి అత్యున్నత వేదికపై ముఖ్యమైన రోజున మెరుగైన క్రికెట్ ను ప్రదర్శించారు అంటూ సచిన్ ఆసీస్ ఆటగాళ్లను కొనియాడారు.
ఓటమన్నదే ఎరుగకుండా వరల్డ్ కప్ ఫైనల్ వరకు దూసుకొచ్చి, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన టీమిండియాపై సానుభూతి పవనాలు వీస్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దీన్ని దురదృష్టంగానే భావించాలని సూచించాడు. టోర్నీ అంతటా అద్భుతంగా ఆడాక, చివరికి ఒక్క మ్యాచ్ లో అదృష్టం ముఖం చాటేస్తే హృదయం బద్దలవుతుందని పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఆవేదనను అర్థం చేసుకోగలను. అభిమానులు, శ్రేయోభిలాషులు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఓటములన్నది ఆటలో భాగం. ఒక్క విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. టీమిండియా ఈ టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ఆటతీరు కనబర్చింది అని సచిన్ ఓదార్పు వచనాలు పలికారు. వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా జట్టుకు సచిన్ అభినందనలు తెలిపారు. ఆరోసారి వరల్డ్ కప్ గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్. వరల్డ్ కప్ వంటి అత్యున్నత వేదికపై ముఖ్యమైన రోజున మెరుగైన క్రికెట్ ను ప్రదర్శించారు అంటూ సచిన్ ఆసీస్ ఆటగాళ్లను కొనియాడారు.
Read Also..
Read Also..
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను భారీ ఎల్ఈడి స్క్రీన్ లో తిలకిస్తున్న యువత. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ కృత్తివేంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను 3 వేల మంది యువత తిలకించేందుకు భారీ ఎల్ఈడి స్క్రీన్ ను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఏర్పాటు చేశారు. ఇండియా క్రికెట్ టీం,ఆస్ట్రేలియా క్రికెట్ టీం తో తలపడుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించి కేరింతలు కొడుతున్నారు. ఇండియా గెలవాలని కోరుకుంటున్నారు క్రికెట్ వీరాభిమాని బిక్కిన సునయన ఇండియా గెలుపొందాలని కోరుకుంటూ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ బిగ్ స్క్రీన్ వద్ద హల్చల్ చేశారు ఇండియా గెలిసి వరల్డ్ కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కాటన్ పార్కు లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు బిగ్ స్క్రీన్ వద్ద వైసీపీ నాయకులు క్రీడాభిమానులతో కలసి మ్యాచ్ ను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాభిమానులు అంతా పండుగ వాతావరణంలో మ్యాచ్ ను వీక్షిస్తున్నారని ఇండియా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also..




Total views : 196359