కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Sri Lakshminarasimha Swamy) వారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతాల నుండి స్వామివారి సన్నిధికి చేరుకున్న భక్తులు వేకువ జామునే స్వామివారి యొక్క కోనేరు దగ్గర పుణ్య స్నానాలు ఆచరించి స్వామి యొక్క దర్శనం చేసుకున్న భక్తులు వారి యొక్క మొక్కులను చెల్లించుకున్నారు. స్వామివారినీ దర్శనం చేసుకోవడానికి గర్భగుడి దగ్గర భక్తులు బారులు తీరి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు స్వామివారి రథోత్సవం ప్రారంభమైంది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి రథం లాగడానికి పోటీ పడ్డారు. స్వామివారి రథం పైకి అరటిపళ్ళు విసిరి తమ కోరికలు తీర్చమని భక్తులువెడుకున్నరు. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామివారిని భక్తులు ఏ విధమైన కోరికలు కోరిన, ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
ఇదిచదవండి: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 61407