Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh కృష్ణా ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో విచారణ

కృష్ణా ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో విచారణ

by Rama
కృష్ణా ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో విచారణ

కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఇతర అవసరాలకు అనుమతులు లేకుండా నీటిని వినియోగిస్తున్న విషయంపై ఆంధ్రప్రదేశ్‌ గతంలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ విషయంపై కేంద్రం నుంచి తగిన ఆదేశాలు తీసుకుని తాజాగా అఫిడవిట్ దాఖలు చేస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటియా కోర్టుకు తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి ఇవ్వడం తమకు సమ్మతమేనని ఆంధ్రప్రదేశ్ గతంలోనే చెప్పింది. ఇదే అంశంపై విముఖత వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె టిఫానీ ట్రంప్‌ ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని అద్భుత శిల్పకళ, నిర్మాణ వైభవాన్ని చూసి టిఫానీ ట్రంప్‌ మంత్రముగ్ధులయ్యారు. ఆలయ ప్రాంగణంలో…
  • సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..
    సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో సైబర్‌ దాడి కలకలం రేపింది. రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్‌ పేమెంట్‌ సిస్టమ్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల సీబీఎస్‌ఈ 12వ తరగతి…
  • కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..
    కర్ణాటకలో సీఎం పీఠం మార్పునకు రంగం సిద్ధమైంది. కర్ణాటక సీఎల్పీ నేతగా.. డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా.. ఆ ప్రతిపాదనను పరమేశ్వర బలపరిచారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు తెలపడంతో ఆయనే సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.…
  • చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…
    అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు,…
  • ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తర్వాత మారిన బీజేపీ రాజకీయం …
    తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ జోరందుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. పశ్చిమ బెంగాల్ తరహాలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగరడం ఖాయమని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018679
Total views : 89157

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.