Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Film “అభిమాని” లో యముడిగా నటించే అవకాశం రావడం నా అదృష్టం: అజయ్ ఘోష్

“అభిమాని” లో యముడిగా నటించే అవకాశం రావడం నా అదృష్టం: అజయ్ ఘోష్

by Prakash
abhimani


“అభిమాని”(Abhimani) వెబ్ ఫిల్మ్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్

సురేష్ కొండేటి(Suresh Kondeti) ప్రధాన పాత్రలో “అభిమాని”(Abhimani) అనే వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు. 2024 కొత్త సంవత్సరం సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమాను సోషల్ మీడియాలో సురేష్ కొండేటి అనౌన్స్ చేశారు . ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ట్యాగ్‍లైన్. ఈ పోస్టర్లో యమధర్మరాజుకు సురేష్ కొండేటి మోకాళ్లపై నిల్చుని ఏదో వేడుకుంటున్నట్లు ఉంది. అభిమాని పోస్టర్ చూస్తుంటే.. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా రానుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‍కే రహ్మాన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను బషీరమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో యముడిగా నటించిన అజయ్ ఘోష్(Ajay Ghosh) తాజాగా ప్రసాద్ ల్యాబ్ లో తన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు.

Follow us on :Facebook, Instagram&YouTube.

ఖచ్చితంగా అందరినీ అలరించే సబ్జెక్ట్ ఇది- అజయ్ ఘోష్(Ajay Ghosh)

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ “యముడు పాత్ర అనగానే తెలుగు వారికి కైకాల సత్యనారాయణ గారు గుర్తుకు వస్తారు. అలాంటి మహానుభావులు పోషించిన పాత్ర నాకు దొరకడం నా అదృష్టం. ఈ పాత్రలో నా నటన మీ అందరినీ కట్టిపడేస్తుంది. నాకు ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ కి థాంక్స్. సురేష్ కొండేటి గారిని ప్రెస్ మీట్స్ లో చూసి ఇప్పుడు ఆయన హీరోగా నేను యముడిగా చేయడం చాలా బాగుంది. ఖచ్చితంగా అందరినీ అలరించే సబ్జెక్ట్ ఇది అన్నారు.

అనుకున్నదానికంటే అవుట్ పుట్ అద్భుతంగా ఉంది- దర్శకుడు రాంబాబు దోమకొండ

దర్శకుడు రాంబాబు దోమకొండ మాట్లాడుతూ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతన్నాయి, త్వరలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాము అన్నారు. అనుకున్నదానికంటే అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా సురేష్ కొండేటి గారు, అజయ్ ఘోష్ గారు అద్బుతం గా నటించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే మరొక ముఖ్య పాత్ర లో అన్నపూర్ణమ్మ గారి సహకారం మరువలేనిది అన్నారు. ఇంకా ఈ సినిమా లో జై క్రిష్, అక్సాఖాన్, దర్శన్, రెహ్మాన్ ఇతర సీనియర్ నటీనటులు నటించిన ఈ చిత్రానికి

  • కొరియోగ్రఫీ : శ్రీధన్,
  • ఫోటోగ్రఫీ : శేషు డి నాయుడు,
  • మాటలు : చరణ్,
  • ఎడిటింగ్ : ఇంద్ర కర్నాటి అందించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో …
చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి …
తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..
తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై 15 …


Advertisements

You may also like

Our Visitor

014308
Total views : 79868

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.