ఎండలు మండిపోతున్నాయి.. జనం ఇళ్లలోంచి బయటకే రావాలంటే జంకుతున్నారు. కానీ, ఆ నిప్పుల కొలిమి లాంటి ఎండలను కూడా ఏమాత్రం లెక్కచేయకుండా ఓ రాష్ట్ర మంత్రి స్వయంగా గడ్డపార పట్టి రంగంలోకి దిగారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు మార్క్ రాజకీయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. పాలకొల్లు మండలం భగ్గేశ్వరం, లంకల కోడేరు గ్రామాల్లో స్మశాన వాటికల అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. శంకుస్థాపనలు చేయడం వరకే పరిమితం కాకుండా.. లంకల కోడేరు గ్రామంలో గ్రామస్తులతో కలిసి ఆయన స్వయంగా శ్రమదానంలో పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఊపిరి సలపనివ్వకుండా చేస్తున్నా.. ఎక్కడా తగ్గకుండా ప్రజలతో మమేకమై మంత్రి పనులు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, స్థానికంగానూ తెగ వైరల్ అవుతోంది. గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.
Tag:





Total views : 91005