డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పి.గన్నవరం మండలం నాగుల్లంకలో నిన్న టిప్పర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మరువకముందే… అదే ప్రాంతంలో మరో లారీ ప్రమాదం చోటుచేసుకుంది.పి.గన్నవరం మండలం నాగుల్లంకలో కంకర చిప్స్ లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్దిరెడ్డి భాస్కరరావు ఇంటి గోడను ఢీకొట్టి బోల్తాపడింది. డ్రైవర్ అతివేగం లేదా నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడగా… ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.నాగుల్లంక ప్రాంతంలో టిప్పర్లు, భారీ లారీలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని… వెంటనే స్పీడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Tag:




Total views : 90872