టీడీపీ అధినేత చంద్రబాబుకి బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు గారి విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం అని జనసేన అధినేత ట్వీట్ చేశారు.
టీడీపీ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి చేరుకునే క్రమంలో అడుగడుగునా నీరాజనాలు పలికారు. ముఖ్యంగా విజయవాడలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. రాత్రి 3.30 గంటల సమయంలో ఆయన కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. అప్పటికే ఎదురుచూస్తున్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అంటూ నినాదాలతో మారుమోగించారు. విజయవాడ నిర్మలా కాన్వెంట్, బెంజి సర్కిల్ పరిసరాలు జైచంద్రబాబు నినాదాలతో దద్దరిల్లాయి. కనకదుర్గ వారధి, తాడేపల్లి, ఉండవల్లి సెంటర్లలో చంద్రబాబు రాకకోసం జనం గంటల తరబడి ఎదురుచూశారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా తెల్లవారుజామున సైతం విజయవాడ నగర ప్రజలు చంద్రబాబును చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు. తెల్లవారుజామున 4.45 గంటలకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్‌కు చేరుకున్న చంద్రబాబునాయుడు కాన్వాయ్కి అపూర్వస్వాగతం లభించింది. విజయవాడ నగరానికి చెందిన వేలాదిమంది మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. పెల్లుబుకిన ఆనందంతో మహిళలు హారతులు ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, నెట్టెం రఘురామ్, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, ఆచంట సునీత, నాగుల్ మీరా, కేశినేని చిన్ని, ఇతర ముఖ్యనేతలు అధినేతకు ఘనస్వాగతం పలికారు. కాగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో రాజమండ్రి నుండి చంద్రబాబు బయలుదేరారు. అభిమానుల తాకిడి ప్రభావంతో ఆయన సుధీర్ఘ నిర్విరామ ప్రయాణం చేయాల్సి వచ్చింది. మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.మధ్యంతర బెయిల్‌కు సంబంధించి కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు కారు లోపల నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. బెంజిసర్కిల్ నుంచి కనకదుర్గ వారధివైపు వెళ్లాల్సిన కాన్వాయ్‌ను పోలీసులు బందరురోడ్డు, ఫైర్ స్టేషన్, వినాయకుడి గుడి, ప్రకాశం బ్యారేజి మీదుగా ఉండవల్లి వెళ్లేవిధంగా దారిమళ్లించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంర బెయిల్ ఇచ్చింది. స్కిల్ స్కాం కేసులో సెప్టెంబర్ 9న అరెస్టైన బాబు 52 రోజుల అనంతరం బయటకొచ్చారు. బయటకు వచ్చిన చంద్రబాబును చూసి టీడీపీ శ్రేణుల్లో భావోద్వేగాలు మిన్నంటాయి. జై చంద్రబాబు నినాదాలతో జైలు పరిసరాలు మార్మోగిపోయాయి. అనంతరం చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. తాను కష్టంలో ఉన్నపుడు తన కోసం ప్రజలు సంఘీభావం తెలిపారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చూపించిన అభిమానం జీవితంలో మర్చిపోనన్నారు. 45సంవత్సరాల తన జీవింతంలో ఏ తప్పూ చేయలేదని.. చేయబోనని అన్నారు. జనసేనకు, పవన్ కళ్యాణ్ కు, సహకరించిన ఇతర పార్టీలకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపునకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే, కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది రోగాల బారినపడ్డారని, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్ వెల్లడించారు. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతోందో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మందుబాబుల తిట్లు వినే ధైర్యం జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో పూర్తిగా ధీనస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్పార్టీ పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి పంపించారు. గత ఏడాది కాలంగా తెలంగాణలో టీడీపీ క్యాడర్ని, నేతల్ని సమన్వయం చేసుకుంటూ వచ్చారు కాసాని జ్ఞానేశ్వర్. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం చెప్పడంతో కాసాని అసంతృప్తికి లోనయ్యారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం పోటీ చేయాలని భావించాయి. అందుకు భిన్నంగా టీడీపీ అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతో ఆయన రాజీనామా చేశారు. ప్రస్తుతం టీడీపీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఎట్టకేలకు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ కోరడంతో ఏపీ హైకోర్ట్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతి ఇచ్చింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్టుకు వరకు చంద్రబాబుకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబును తీసుకువెళ్ళి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చికిత్స చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబుకు అధికారులు ఎన్ఎస్జీల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ , ఆయన సతీమణి బ్రాహ్మణి రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించారు. యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యిందని నాయకులు, కార్యకర్తలతో లోకేష్ అన్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. పార్టీ శ్రేణులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. శ్రీకాళ హస్తి రూరల్ మండలంలోని కామ కొత్తూరు గ్రామంలోని చెంచయ్య నాయుడు ఇంటి వద్దకు వెళ్లి రూరల్ సీఐ అజయ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించండం వివాదంగా మారింది. ఇదే అంశంపై బొజ్జల సుధీర్ రెడ్డి..సీఐతో మాట్లేడేందుకు ప్రయత్నించగా. సుధీర్ రెడ్డి పై కూడా సీఐ అజయ్ కుమార్ అసభ్య పదజాలంతో దూషించడంతో వివాదం మారింత తీవ్రంగా మారిపోయింది. ఈ నేపధ్యంలో రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున్న చేరుకున్న టీడీపీ శ్రేణులు స్టేషన్ ను ముట్టడించారు. సిఐ అజయ్ కుమార్ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలంటూ బైఠాయించారు. తిరుపతి SP తో ఫోన్లో మాట్లాడి… సిఐ అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి కి వినతి పత్రం అందజేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వైసీపీపై అసంతృప్తి పెరగడం వల్లే.. ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రపై మండిపడ్డారు. రేపల్లెలో పదో తరగతి చదివే బీసీ విద్యార్థి దహనం చేసిన ఘటనపై ఒత్తిడి తేవాలని స్పష్టం చేశారు. నంద్యాలలో మైనార్టీ వ్యక్తి సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వైసీపీకి గుర్తు చేయాలన్నారు. రద్దు చేసిన పథకాలపై సమాధానం చెప్పిన తర్వాతే వైకాపా బస్సు యాత్ర చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.