ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే, విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు వాదనలకు కొంత సమయాన్ని (పాస్ ఓవర్) కోరారు. దీంతో, మధ్యాహ్నం పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. మరోవైపు, విధానపరమైన నిర్ణయాలకు నేరాలను ఆపాదిస్తున్నారని పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్నారు. 17ఏ ప్రకారం కేసు నమోదుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని చెప్పారు.
టీడీపీ
రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని సీఐడీని ఆదేశించింది. మరోవైపు వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ… స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారని… ఆ గడువు ముగిసేంత వరకు ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపారు. మధ్యంతర బెయిల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోబోమని తెలిపారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన హైకోర్టు… అరెస్ట్ చేయవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.
ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఆమె ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీతో అంటకాగారని, చంద్రబాబు పార్టీ నుంచి గెంటేస్తే కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. తన తండ్రిని అవమానించిన పార్టీ అంటూ అప్పటి వరకూ విమర్శించిన అదే కాంగ్రెస్ లో చేరి, నిస్సిగ్గుగా పదవులు చేపట్టారని అన్నారు. తండ్రిని అవమానించి, ఆ పునాదులపై ఏర్పాటైన టీడీపీలో అధికారం ఉన్నంతకాలం ఉన్న నీతిలేని చరిత్ర ఆమెదని తీవ్రంగా విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేసిన మహా గొప్ప మహిళ అని పురంధేశ్వరిపై మండిపడ్డారు.
Read Also..
Read Also..
గుంటూరు జిల్లా టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభకార్, అధికార పార్టీ చేస్తున్న సాధికార యాత్ర పై విమర్శలు చేశారు. అర్భన్ పార్టీ కార్యాలయం లో ప్రభాకార్ విలేకర్లతో మాట్లాడుతూ సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్నందన కూడా లేదన్నారు. గుంటూరు తూర్ను నియోజకవర్గంలో ఏం చేశారని బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న యం.ఎల్.ఏ ఒక కమెడియన్ అని ఎద్దేవా చేశారు.నియోజకవర్గ అభివృద్ధి పై ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కుంటి సాకులతో కలం గడిపారు. ఎన్నికల సమయం వచ్చే సరికి ప్రజలను మబ్బేపెట్టనందుకు కొత్త యాత్రలు తేరా మీదకు తీసుకువచ్చారు. వైసిపి పార్టీ నిర్వహించే ప్రతి సమావేశానికి వైసిపి నాయకులూ బెదిరించి మరీ తరలించుకొచ్చిన డ్వాక్రా మహిళలు, పథకాల లబ్ధిదారులు నేతల ప్రసంగాలు మొదలెట్టగానే పరారవుతున్నారు. కొందరైతే స్థానిక సమస్యలపై నిలదీస్తున్న నాయకుల్లో ఎలాంటి స్పందన లేదు.బస్సు యాత్రకు భారీగా జనసమీకరణ చేయాలంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి.
వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం, ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో, విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా పురందేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారని అన్నారు.ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? అని పురందేశ్వరిని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో మీ నిజాయతీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలంటూ సవాల్ విసిరారు. మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర మీ కుటుంబ సభ్యులు ముడుపులు తీసుకున్నారని అన్నారు.హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారని, ఆ విల్లాకు సొమ్ము ఎవరు ఇస్తున్నారంటూ పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శనివారం కోనాయిపల్లి రానున్నారు. తాను సెంటిమెంట్‌గా భావించే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు. 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్.. ఓటమి పాలయ్యారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడంతో కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసి, నామినేషన్లు దాఖలు చేయడం కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా మారింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇదే ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్ ఈసారి కూడా వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత రెండు వేర్వేరు నామినేషన్ సెట్లపై సంతకాలు చేయనున్నారు. ఈనెల 9న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు సైతం కేసీఆర్‌తోపాటు ఇదే ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసే ఆనవాయితీని 2004 నుంచి కొనసాగిస్తున్నారు.
టీడీపీ కాదు.. జనసేన మా భాగస్వామ్య పార్టీ అని, పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టంచేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ స్ట్రాటజీ వల్లే గెలిచామన్నారు. పొత్తుల్లో కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రయోజనాలే కాదు, దేశ ప్రయోజనాలు కూడా చూస్తామని తెలిపారు. నేతలు పార్టీ వీడినంత మాత్రాన మాకు నష్టం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో టీడీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇప్పటి వరకు ఎక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పలేదని అభిప్రాయపడ్డారు.
కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి, వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఛీకొడుతున్నా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 16 గంటల సమయం పట్టింది. కోర్టు నిబంధనలు లేకపోతే ఇప్పుడు వచ్చినదానికంటే నాలుగు రెట్లు అధికంగా జనం వచ్చేవారు. చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించకుండా కారులోనే ఉండి ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. లోకేశ్ ఢిల్లీ వెళితే వైసీపీ వాళ్లకెందుకు ఉలికిపాటు. అక్రమ కేసులో చంద్రబాబును 52 రోజులు నిర్బంధించారు. ఆయన అవినీతికి పాల్పడ్డట్టు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ అవకతవకలు జరిగాయంటూర మరో కొత్త కేసు పెట్టారు. వైసీపీ వాళ్లు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు’’ అని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. సీఐడీ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా… చంద్రబాబు తరపు న్యాయవాదాలు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. నవంబర్ 3న ఆర్డర్స్ ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. ‘సంస్థాగతంగా బీజేపీని ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని ఢిల్లీ పెద్దలకూ తెలుసులేమ్మా పురందేశ్వరి. ఇసుకను గతంలో దోచుకునేవారు. ఇప్పుడు సహజవనరుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తోందని తెలుసుకోమ్మా. గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!’ అని ట్వీట్ చేశారు.