రాయదుర్గం పట్టణంలోని మొల్కల్ముర్ రోడ్డు గాంధీనగర్ నగర్లో గత 20 రోజులుగా తాగినీటి సమస్య నెలకొంది. దీంతో కాలనీ నివాసులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని మండిపడ్డారు. ప్రతినెలా 150 రూపాయలు కట్టించుకున్న కానీ నీరు సరిగ్గా సరఫరా చేయలేక పోతున్నారని కాలనీ వాసుల ఆవేదన చెందారు. డబ్బులు ఎలాగైతే కట్టుంచుకుంటారో అలానే నీటిని కూడా సరఫరా చేయాలన్నారు. గత 20 రోజులుగా నీరు లేక నానా అవస్థలు పడుతున్నామని ఇప్పటికీ నీరు రాకపోతే మూత్రం సేవించి బ్రతకలా అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నీటి సరఫరాపై స్పందించాలని విన్నవించుకున్నారు.
Tag:




Total views : 79795