రిమాండ్ (Remand) :
సీఎం జగన్‌పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీశ్‌కు కోర్టు 14 రోజలు పాటు రిమాండ్ (Remand) విధించింది. విజయవాడ సింగ్ నగర్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపి నిందితుడు సతీశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితుడు సతీశ్‌కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అయితే నిందితుడు సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. సీఎం జగన్ పై నిందితుడు రెండు సార్లు రాయి విసిరినట్లు తెలిపారు. ఒక సారి మిస్ కావడంతో మరోసారి తగిలినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్‌పై దాడి చేయమని నిందితుడు సతీశ్‌కు దుర్గారావు అనే వ్యక్తి చెప్పినట్లు చెప్పారు. దాడి తర్వాత దుర్గారావుకు నిందితుడు సతీశ్ ఫోన్ చేశారని, మరోసారి చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- అనంతపురంలో పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు కీలక పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం…
- వైభవంగా గోదావరి పుష్కరాలు.గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 8…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జగన్‌పై దాడి కేసులో నిందితుడికి 14 రోజల రిమాండ్…