విజయవాడ, అంగన్వాడీలతో ప్రభుత్వం చర్చలు సఫలం. రేపట్నుంచి విధుల్లోకి అంగన్వాడీలు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశాం. జూలై లో జీతాలు పెంచుతాం. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని 50 వేల నుంచి లక్షా 20 వేల రూపాయలకు పెంచాం. హెల్పర్ కు 60 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. మట్టి ఖర్చులు 20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. సమ్మె కాలానికి జీతాలు ఇస్తాం. సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తాం. వేతనాల పెంపు పై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తాం. గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తాం. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్ళ కు పెంచాం. అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం. మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి. కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వం లేదు. మినీ సెంటర్లను అప్ గ్రేడ్ చేస్తాం అని వెల్లడించారు.
andhra pradesh
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం అంగన్వాడీలు అనుకుని రైతు కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు కూలీలను అంగన్వాడీ కార్యకర్తలు అనుకుని అత్యుత్సాహం ప్రదర్శించిన పొలిసులు. కూలీలు మేము అంగన్వాడీ కార్యకర్తలు కాదు అని చెప్తున్న వినకుండా వారిని స్థానిక ఒక ఫంక్షన్ హల్ కు తరలింపు. అదే ఫంక్షన్ హల్ లో అప్పటికే అదుపులో తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రైతు కూలీలు. చివరికి రైతు వచ్చి మా పొలంలో పనికి వచ్చిన కూలీలు అని చెప్పిన తర్వాత వారిని వదిలిన పోలీసులు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలంలో ని అన్ని గ్రామాల్లో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను, శ్రేణులను కలిసి 2024 ఎన్నికల్లో పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 లో గెలిచేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి అని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది అని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే దమ్ము ప్రతిపక్షాలకు లేదు అని, ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చిన భయపడే ప్రసక్తి లేదని ప్రజల గుండెల్లో మేము స్థానం సంపాదించుకున్నామని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం లో 2019 ఎన్నికల్లో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచి పెనమలూరు గడ్డపై వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి జోగి రమేష్ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం నియోజకవర్గం, ఎపిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ర్యాలీని అడ్డుకున్న విజయవాడ పోలీసులు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆందోళన, ఆగ్రహం. పోలీస్ తీరుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట ప్రకారమే షర్మిల రోడ్ షో అడ్డుకున్నారంటు కాంగ్రెస్ నేతలు విమర్శలు. రోడ్డుపై బైటాయింపు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు. కావాలనే అడ్డుకున్నారంటున్న కాంగ్రెస్ నేతలు. వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతుంది. నేను భాద్యతలు తీసుకుంటున్న ఈ సమయంలో మా కాన్వాయ్ నీ ఎందుకు ఆపారు ? మమ్మల్ని చూసి భయపడుతున్నారా సార్ ? అంటూ పోలీసులతో వాగ్వాదం. APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వాహన కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు. ఎనికే పాడు వద్ద వాహనాలను మళ్లించిన పోలీసులు. వాహనాలను డైవర్ట్ చేసేందుకు నిరసనగా రోడ్డుమీద బైఠాయించిన కాంగ్రెస్ నేతలు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఏపీ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపుతున్న వైయస్ షర్మిల చేరిక. రాష్ట్ర కాంగ్రెస్ లో దశాబ్దం తర్వాత కనబడుతున్న నూతన ఉత్సాహం. కానూరు వద్ద ఏపీ పీసీసీ అధ్యక్షరాలిగా చేపట్టనున్న బాధ్యతలు, ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణుల భారీ ఏర్పాట్లు. గన్నవరం నుండి విజయవాడ వరకు ఎటు చూసినా షర్మిల ఫ్లెక్సీలు. షర్మిల రాక రెండు గంటలు ఆలస్యం అయిన కానూరు సభాస్థలి వద్ద కార్యకర్తల్లో తగ్గని ఉత్సాహం.
కృష్ణాజిల్లా, గన్నవరం, కడప నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ షర్మిల. షర్మిల వెంట వచ్చిన ఏపీ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్య ఠాకూర్, కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, తులసిరెడ్డి. స్వాగతం పలికిన మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జేడీ శీలం, పలువురు నేతలు. గన్నవరం నుండి విజయవాడ బయల్దేరిన షర్మిల. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక తొలిసారి విజయవాడ వచ్చిన షర్మిల.
కృష్ణాజిల్లా, మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటివరకు పార్థసారథి మాతోనే ఉన్నాడు, ఇప్పటికి వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు. టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు. నాకు ఏమి హైదరాబాద్ లో వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవు. నేను ఉండేది పెనమలూరులోనే. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో 2024లో అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగరేస్తాం.
విజయవాడ, కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు చేస్తున్న అమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు. కోడి కత్తి శీను ను వెంటనే విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. కోడి కత్తి శీను జైలు నుండి బయటకు రావాలని మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కోడికత్తి శీను కుటుంబ సభ్యులు. కోడికత్తి శీను తల్లి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన ఆరోగ్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రి తరలించిన పోలీసులు. పోలీసులు నిరాహార దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పోలీస్ జీబు ముందు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోబోయిన నిరసనకారులు. వెంటనే స్పందించి అతని వద్ద ఉన్న అగ్గిపెట్టెను లాక్కున్న పోలీసులు. నిరసనకారులను చెదరగొట్టి కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను విజయవాడ హాస్పటల్ తరలించిన పోలీసులు.
నెల్లూరు జిల్లా కలువయి మండలం వెంకటరెడ్డి పల్లి జంక్షన్ వద్ద తమిళనాడు కూలీలను పట్టుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్సై రాఘవేంద్ర వారి సిబ్బంది. వెంకట రెడ్డి పల్లి హైవే 565 కూడలిలో టెంపో వాహనం లో ప్రయాణిస్తున్న 20 మంది కూలీ. వాహనం ను ఆడుకున్న అధికారులపై స్మగ్లర్లు దాడి కి యత్నం. వెంకట రెడ్డి పల్లి గ్రామస్తులు సహకారం తో స్మగ్లర్లు, కూలీలను పట్టుకొన్న పోలీసులు. వారి వద్ద గొడ్డళ్ళు, కత్తులు. ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. దళితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని చెపుతున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షీగా మరో మోసానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తు అంబేద్కర్ విగ్రహం సాక్షీగా దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్ విదేశి విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. దళితులకు పధకాలు రద్దు చేసి వారికి రూ 30 వేల కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారు. నవరత్నాల వలన దళిత బహుజనులకు ఏటువంటి మేలు జరగలేదు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్ధాలుగా ఉంటున్న పేద దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతిదినం సామాజిక మోసానికి పాల్పాడేది వైకాపా ప్రభుత్వం కాదా? సామాన్యుల గొంతుక అంబేద్కర్ అని చెప్పిన సీఎం జగన్ ఏపీలో ఎవరైనా గొంతు ఎత్తితే గొంతు కోసే సాంసృతి మీ పరిపాలనలో జరగటంలేదా? గొంతు ఎత్తిన వారి గొంతు కోసే ఫ్యాక్షన్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ది. అంటరాని తనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడిని చంపిన ఎమ్ ఎల్ సీ అనంతబాబు ను ప్రక్కన పెట్టుకొని దళితులకి ఏం సందేశం ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షీగా రాజకీయాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. మాయ మాటలతో దళితులను కుట్రల రాజకీయాలతో బానిసలగా మార్చలనే వైకాపా ప్రభుత్వానికి రాబోయో రోజులలో చావుదెబ్బ తప్పదు. రాజధాని ప్రాంతంలో దళిత పేదలకు పట్టాలు పంపిణి చేసినట్లు పైకి చెప్తూ లోపల వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేశారు. దళితులపై వాళ్ళ మారిన ప్రేమ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకులకు ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారేమో శ్వేతపత్రం విడుదల చేయాలి.