ఎక్కడైనా అభిషేకం అంటే పూలతోనో , పాలతోనో చేస్తారు కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడూ ఎక్కడా చూడని విధంగా కారం తో అభిషేకం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులోని శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమంలో శివ స్వామికి కారంతో అభిషేకం నిర్వహిచారు. స్వస్తిశ్రీ చంద్రమానేనా క్రోధి నామ సంవత్సర కార్తీక బహుళ పంచామి రోజు సందర్భంగా కారం తో అభిషేకం నిర్వహించారు. చాలాకాలం నుంచి కారంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం 50 కేజీల కారంతో అభిషేకం చేయగా, ఈసారి 60 కేజీల కారంతో అభిషేకం చేశారు. స్వామికి అభిషేకం చేసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన కారంతో శివస్వామి బాబాకు అభిషేకం చేయించుకున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది.…
- ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…
- ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి.పశ్చిమాసియా యుద్ధ సెగ ఐటీ ఉద్యోగులకు తగిలింది. ఫుడ్స్ పెట్టలేమంటూ హైదరాబాద్ ఐటీ కారిడార్ హాస్టల్ యాజమాన్యాలు సర్క్యులర్ జారీ చేశాయి. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా హైదరాబాద్ హాస్టల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని తెలిపాయి. కేవలం ముఖ్యమైన ఆహార…
- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం,…
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి