నారా లోకేష్ నవంబర్ 24 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటివరకు మొత్తం 2852.4 కిలోమీటర్ల దూరం నడిచారు. 208వ రోజు పొదలాడ, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం, కోనసీమ జిల్లా వద్ద పాదయాత్ర ఆగి పోయింది. అయితే పాదయాత్రను ముందుగా అనుకున్న ఇచ్ఛాపురం వరకు కాకుండా విశాఖలోనే ముగించే ఆలోచనలో నారా లోకేష్ ఉన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర విశాఖలోనే ముగించిన నేపథ్యంలో టీడీపీ విశాఖనే సెంటిమెంట్ గా భావిస్తోంది. దీంతో విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడితో పాదయాత్ర ముగించాలని నారా లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో విశాఖ వరకే చేయాలని నారా లోకేష్ అనుకుంటున్నట్లుగా సమాచారం.
andrapradesh
బ్రేకింగ్ న్యూస్…
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం. దాదాపు 50 కోట్లు పైన అగ్నికి ఆహుతి. కోట్ల విలువ చేసే తమ ఆస్తి కళ్ళముందే బూడిద పాలు అవుతున్న వైనం. విశాఖ పాత నగరంలో అలుముకున్న విషాద ఛాయలు. ఈ ఘటనపై ఆరా తీస్తున్న ఉన్నత స్థాయి అధికారులు. అగ్నిమాపక దళాలు, పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుంటున్న వైనం. ప్రమాదంపై ఆరా తీస్తున్న విశాఖ ఉన్నతాధికారులు. జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 40 మెకానిజడ్ బోర్డ్స్ అగ్నికి ఆహుతి అయ్యాయి. మూడు గంటల అగ్నిమాపక సిబ్బంది కృషితో మంటలు అదుపులోనికి వచ్చాయి. ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందని, తమ కళ్ళముందే అగ్నికి ఆహుతి అయిన బోట్లను చూసి మత్స్యకారులు తీవ్ర మనోవేదనకి గురయ్యారు. ప్రాణ నష్టం లేకుండా మంటలను అదుపులోకి తీసుకు వచ్చామంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ రెడ్డి వెల్లడించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా..
ముమ్మిడివరం అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. కోన మాచరయ్యకు చెందిన తాటాకు ఇల్లు గా సమాచారం. నిరాశ్రయులై కట్టు బట్టలతో మిగిలిన రెండు కుటుంబాలు. దాచుకున్న డబ్బు, బంగారం కూడా కాలిపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్న మాచరయ్య కుటుంబ సభ్యులు…
Read Also..






Total views : 79999