రేపు కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తన మొక్కులను తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా జనసేన అధినేత భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు.. ఆ వాహనానికి తొలిపూజ కూడా కొండగట్టులోనే పవన్ కళ్యాణ్ నిర్వహించారు.
అలాగే, ఎన్డీయే కూటమి పొత్తులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించింది కూడా కొండగట్టులోనే కావడం గమనార్హం. రేపు హైదరాబాద్ నుంచి రోడ్ మార్గం ద్వారా పవన్ కొండగట్టుకు చేరుకుంటారు. జేఎన్టీయూలో హెలీప్యాడ్ అందుబాటులో లేకపోవడంతో.. పవన్ సెక్యూరిటీ స్పెషల్ అడ్వైజర్ కల్నల్ అర్జున్ రూట్ మ్యాప్, పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తెలంగాణ జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. ‘వీజీఎఫ్ విప్లవం ఖాయం.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యయంపై అధికారులతో సమీక్షించిన సీఎం… త్వరలోనే ‘ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ను తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు…
- కరీంనగర్ జిల్లా ఘన్ముక్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విచిత్ర పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ ఉన్నత…
- అరకులోయలో ట్రైబల్ ఆర్టిజన్ మేళా ఘనంగా ప్రారంభం.అడవుల ఒడిలో పుట్టిన గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్త మార్కెట్ దిశగా అరకులోయలో కీలక అడుగు పడింది. గిరిజన కళ, కృషి, సంప్రదాయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో నిర్వహించిన ట్రైబల్ ఆర్టిజన్ మేళా విశేష స్పందన లభిస్తోంది. భారత ప్రభుత్వ…
- నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పట్టుకున్న పోలీసులు.మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లోని మహేశ్వర ట్రేడర్స్ నుంచి గోలేటికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ జెమిని టీ పౌడర్ బాక్సులను పోలీసులు వాహన తనిఖీల్లో పట్టుకున్నారు. స్థానిక టోల్ గేట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా…
- జూపార్క్ ను సందర్శించిన ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ వన్యప్రాణి – పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పడింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూలాజికల్ పార్క్ ను కమిటీ సందర్శించింది. ఆధునికీకరణ, అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడితో పాటు ఎమ్మెల్యేలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 212440