ఏపీ యువతకు ఉగాది కానుకగా ప్రభుత్వం ఉద్యోగాల పండుగ ప్రకటించింది. మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ క్యాలెండర్లో ప్రభుత్వ విభాగాల్లో 10,060 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల తేదీలు, భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యలు తెలియజేశారు. సిలబస్ ముందస్తుగా ప్రకటిస్తామని.. నిర్దేశిత సమయాల్లో పరీక్షలు నిర్వహించి అన్ని పోస్టులు భర్తీ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఉద్యోగార్థులు నైపుణ్యం పోర్టల్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా అలర్ట్లు పొందవచ్చని కూడా చెప్పారు. ప్రతి ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగగా కొనసాగుతుందని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు.
ap govt
మన పిల్లలు ప్రపంచస్థాయితో పోటీపడాలని.. అప్పుడే భవిష్యత్తు మారుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్క్స్తో సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఎంవోయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంమని, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదమన్నారు.. కానీ పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు.. ఇది ఇక కొత్త నినాదం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారని చెప్పారు. ఈదేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ ప్రపంచంతో మనం పోటీపడుతున్నామన్నారు. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలన్నా,,,. మంచి మంచి జీతాలు సంపాదించాలన్నా నాణ్యమైన విద్యద్వారానే సాధ్యమవుతుందని సిఎం జగన్ అన్నారు.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయిందని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఏపీ ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట ప్రతిష్ఠాత్మక రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రీడలకు అధికారిక చిహ్నం గా కృష్ణజింక కిట్టును రూపొందించారు. ఈ మస్కట్ ను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో స్పందించారు. మన ‘ఆడుదాం ఆంధ్రా’ అధికారిక చిహ్నం ‘కిట్టు’ను పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అని వెల్లడించారు. “ఈ రాష్ట్ర వ్యాప్త టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు ఉన్నతస్థాయికి చేరుకుంటారని నేను నమ్ముతున్నాను… ప్రతి ఒక్కరూ ఈ రోజే రిజిస్టర్ చేసుకోండి” అని పిలుపునిచ్చారు. ఏపీలో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 వరకు జరగనున్నాయి. వివిధ క్రీడాంశాల్లో పోటీ పడే ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు డిసెంబరు 13 వరకు అవకాశం ఉంది.
Read Also…
Read Also…





Total views : 141755