హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. గత టీడీపీ హాయంలో ఆర్టీసీ బస్సులు వేస్తే, హిందూపురం డిపో నుండి పది బస్సులు చిత్తూరు జిల్లా పుంగనూరుకు తీసుకెళ్లారంటూ మాజీమంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి పై ఘాటైన విమర్శ చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిపోయిందని బాలకృష్ణ విమర్శించారు. వైసీపీ చేసిన పాపాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. అమాయకులను హత్యలు చేయించారని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు వైసిపిపై ఆగ్రహించి కూటమిని గెలిపించారన్నారు. ఏపీలో అభివృద్దే లక్ష్యంగా కూటమి పని చేస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. హిందూపురం టీడీపీ కార్యాలయంలో 64 కేజీల కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బాలకృష్ణకు టీడీపీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?ప్రముఖ నటుడు గెటప్ శ్రీను తాజాగా జర్నలిస్ట్ జాఫర్ కు ఇచ్చిన వ్యక్తిగత ఇంటర్వ్యూలో చోటుచేసుకున్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహదేవపట్నంలో జరిగిన ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో సరదాగా సాగిన సంభాషణ, కొద్ది సేపటికే ఉద్రిక్తతకు దారితీసింది.…
- నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది. మేజర్ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. గత…
- ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా జరిగిన ఆ ఘోర కలికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోను యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విడుదల చేశారు. నిందితుడు కోల్ థామస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 62014