నెల్లూరు జిల్లా, ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు. ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 51 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు కూడా అదుపులో తీసుకున్నారు.
Tag:
Belt shops
నల్గొండ జిల్లా.. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామమంలో స్వచ్చందంగా బెల్టుషాపులు మూసీవేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయం, గ్రామాల్లో బెల్టుషాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా, బెల్టుషాపుల నియంత్రణపై ప్రభుత్వ నిర్ణయానికి ముందే కృషి చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పాలాభిషేకం మహిళలు చేశారు. గ్రామంలో బెల్ట్ షాపులు స్వచ్ఛందగా నిలిపివేత పై హర్షం వ్యక్తం చేస్తూ మహిళలలు ర్యాలీ లు నిర్వహించారు.