ప్రజలను మభ్యపెట్టి, ఆశపెట్టి పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. కొన్ని రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు చేస్తే ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తామంటూ ఆశపెట్టి పార్టీ సభ్యత్వాలు ఇస్తున్నాయన్న ఆయన.. పార్టీ కన్నా దేశమే గొప్పదన్నారు. ఒకప్పుడు రెండు ఎంపీ స్థానాలు గెలిచిన రోజు అవహేళన చేశారని, కానీ ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందని, లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో సైతం 36 శాతం వరకు ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. టార్గెట్ కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు చేయించాలని కార్యకర్తలు, నేతలకు పిలుపుఇచ్చారు. ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 200 మందితో సభ్యత్వ నమోదు చేయించాలన్నారు కిషన్ రెడ్డి. కనీసం 100 మందికి పైగా సభ్యత్వం చేసిన వారికే పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని, అలాగే క్రియాశీలక సభ్యత్వం కావాలంటే 100 మందిని విధిగా చేర్పించాలని కిషన్ రెడ్డి సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్.శాసనమండలిలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తోందని స్పష్టం చేశారు. భూముల కేటాయింపుల విషయంలోనూ పూర్తి వివరాలతో సమాధానాలు ఇస్తున్నామని…
- తెలంగాణ అసెంబ్లీలో కంటిన్యూ అవుతున్న రచ్చ.తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా వాడీవేడిగానే సాగింది. మైక్ ఎవరిదైనా.. మాటల తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, 22ఏ భూముల వివాదం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రతిపక్షాల ఆందోళనతో సభ రాజకీయ రణరంగంగా మారింది.…
- త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేత రియాక్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు మంచితనాన్ని చూసి గతంలో జగన్ పాదయాత్ర చేశారని, కానీ ఇప్పుడు అలా కుదరని…
- 280 ఎకరాల వెంచర్ వ్యవహారంలో వివాదాలు.ప్రముఖ రియల్టర్, హోమ్‌ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని తన ఫాంహౌస్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పటాన్చెరులో 280 ఎకరాల్లో వెంచర్ అభివృద్ధి చేస్తున్న రాంరెడ్డి.. స్థానిక నేతలు, పలువురి ఒత్తిళ్లతో తీవ్ర…
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టడంతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి