లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) సమయంలో తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పార్టీ(Congress party)కి షాక్ తగిలింది. కొన్నిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా బీజేపీలో చేరారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
వారికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటేశ్ నేత 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్‌కు టిక్కెట్ ఇచ్చింది. ఈ క్రమంలో వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అంతలోనే మళ్లీ ఈరోజు కమలం పార్టీ కండువాను కప్పుకున్నారు. పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ను గెలిపించేందుకు కృషి చేస్తారని కిషన్ రెడ్డి చెప్పారు.
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది. దుమ్ము, ధూళితో కప్పుకుపోయిన ఈ…
- ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు లూసియానాలోని టొరోడో పార్క్‌లోని సెబాన్ రివర్‌లోకి కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లాడు. హఠాత్తుగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90956