ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గైగోళ్లపల్లి, సంధ్యతండా గ్రామాల్లో పాలేరు బిఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య భీమా వర్తించేలా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు ఇప్పిస్తానని అన్నారు. మీ ఊరికి నేను చాలాసార్లు వచ్చానని, మీ ఊర్లోనే ఎవరు ఏ సహాయం కోరిన చేశానని, కావున మీ ఊరిలోనే అన్ని పార్టీల ఓటర్లు నాకే ఓటు వేయాలని అన్నారు. పాలేరు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం మరోసారి కల్పించాలని అన్నారు.
నవంబర్ 30 న జరిగే శాసన సభ ఎన్నికలలో కారు గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
BRS leaders
అచ్చంపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజ్ పై జరిగిన దాడి ని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. దాడి పిరికి చర్య అని మండిపడ్డారు. ప్రచారం నిర్వహించి తిరిగి వెళుతున్న క్రమంలో ఇలాంటి ఆటవిక చెరగకు పాల్పడడం కాంగ్రెస్ నేతలకు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోతామనే భయంతో ఇలాంటి పిరికి చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ కు ప్రజల్లో ఉన్న ఆధార అభిమానులను చూసి ఓర్వలేకపోతున్నారని, ఓడిపోతామనే భయంతో ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం ఇన్నాళ్లు మాకు కలిగిందని ఇకపై కూడా ప్రజలు మమ్ములను ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని మా పార్టీ సేవలే మాకు శ్రీరామరక్షగా ఉంటాయని అన్నారు. దాడులకు పాల్పడితే సహించమని హెచ్చరించారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు తో కలిసి బాలాజీ నగర్ డివిజన్ లోని వివిధ ప్రాంతాల్లో అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు.. ఇందులో భాగంగా ఆంజనేయ నగర్… బాలాజీ నగర్, కెపిహెచ్బి రోడ్ నెంబర్ 1..3.. లో ప్రజలతో మాట్లాడుతూ ఒకప్పుడు బాలాజీ నగర్ డివిజన్లో మంచినీళ్లు కొరతతో చాలా ఇబ్బంది పడే వారమని ఇప్పుడు 24 గంటలు విద్యుత్ మంచినీరు, సిసి రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో చేసి చూపించామని అన్నారు. బాలాజీ నగర్ లో ఇంకా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇప్పటికే ప్రణాళిక బద్ధంగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి వస్తున్నామని భవిష్యత్తులో నాళాలు సమస్య అనేది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరువులు సుందరీ కరణతో ఇప్పటికే రంగధామును చెరువును అత్యద్భుతంగా తీర్చిదిద్దుకున్నామని మిగిలిన చెరువులను కూడా సుందరీకరించుకుని ఎస్టీపి ప్లాంట్లు నిర్మాణం పూర్తిచేసుకుని కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చబోతున్నామని అన్నారు.. ఇంత అత్యద్భుతమైన ప్రణాళికలు ఉండబట్టే నేడు తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందుతుందని ఇటువంటి ముందుచూపు ఉన్న వ్యక్తినే మళ్లీ సీఎం గా కొనసాగించాలని అందుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించుకుందామని.. తాను పోటీ చేస్తున్న కూకట్పల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇప్పించి గెలిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్.. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
తాండూరు ప్రజలే ప్రచారకులు… ప్రజల ఆలోచన లు.. ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను… ఆశీర్వదించండన్నారు. ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను.. ఎన్ని మార్కులు వేస్తారో మీ నిర్ణయమని అన్నారు. ఎన్నికలప్పుడు వచ్చేది ఎవరు…. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండేది ఎవరు తాండూరు ప్రజలు ఆలోచించాలన్నారు. తాండూరు పేరు ప్రతిష్ట ను గౌరవాన్ని పెంచుకున్నాం… మరింత నిలబెట్టుక్కనేది ప్రజల ఆలోచననే అని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశాను. తాండూరు ప్రజల ఆశీర్వాదం తో మంచి మెజార్టీ తో గెలిపించండన్నారు. ప్రతిరోజూ మీ కోసం 18గంటలు కష్టపడ్డ.. మీ కష్ట సుఖల్లో ఉన్నానన్నారు. తాండూరు ప్రజలు నా కుటుంబ సభ్యులన్నారు. గతంలో అద్భుత విజయం అందించి సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఐదేళ్లు కష్టపడి పనిచేశా మీ ఆత్మా సాక్షిగా నాకు మార్కులు వేయండన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు..ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్, ఎంఎల్ సి శంభీపూర్ రాజు పాల్గొన్నారు.. ప్రత్యేకపూజల అనంతరం వేలాదిమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సురారంలోని కట్టమైసమ్మ ఆలయం నుండి జిహెచ్ఎంసి వరకు ప్రతి కార్యకర్త చేతిలో గులాబీ జెండా, మెడలో గులాబీ కండువతో పండుగ వాతవరణంలో భారీ ర్యాలీని నిర్వహించి మరో సెట్ నామినేషన్ ను వేశారు. ఎంఎల్ఎ అభ్యర్థి వివేకానంద.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేవెళ్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ లో భాగంగా భారీ ఎత్తున జన సమీకరణతో షాబాద్ చౌరస్తా నుంచి నామినేషన్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ దాఖల్లో చేవెళ్ల బిఆర్ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, షాబాద్ జడ్పిటిసి అవినాష్ రెడ్డి తోపాటు మిగతా కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కెసిఆర్ ఆయన పథకాలన్నీ నమ్మి ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ వచ్చిందని నన్ను నమ్మి పెద్ద ఎత్తున వచ్చిన జనాలకు నా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పట్లోల్లా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధు జంతువు లాంటి వ్యక్తిని నమ్మి ఓట్లు వెయ్యాలని ఆయన కోరారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నేర చరిత్రను చూసి మీరు ఓట్లు వేయాల్సిందిగా ఆయన చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు త్రిబుల్ వన్ జీవోను అలాగే ఉంచాలని కోరుతున్నట్లు కానీ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా 111 జీవో ను తీసివేయాలని కోరుకుంటున్న అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు..
Read Also..
శేర్లింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరికెపూడి గాంధీ ఇంటింటి ప్రచారం చేశారు. మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.. మహిళలకు ప్రజలకు ఏం కావాలో మా హయాంలో చేశామన్నారు. రోడ్లు, కరెంటు వాటర్ సప్లై …డ్రైనేజీ వ్యవస్థ సంక్షేమ పథకాలు అన్ని అందించామని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. గతంలోకాలనీలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలనీలో చాలా మార్పు కనిపిస్తుంది అన్నారు. కలబొల్లి మాటలకు మోసపోవద్దని..సరైన నాయకున్ని ఎన్నుకొని ఇంకా అభివృద్ధిలో దూసుకుపోవాలని ఆయన కోరారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశాన్ని పటాన్ చెరులోని జీఎంఆర్ కన్వన్షన్ సెంటర్ లో నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ లు కాసాని జ్ఞానేశ్వర్, భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులే మూడో సారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయన్నారు. పటాన్ చెరులో ఎమ్మెల్యే గా గూడెం మహిపాల్ రెడ్డి విజయం ఎప్పుడో ఖరారైందని, మెజార్టీయే మిగిలిందన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నుంచి కొత్త బిచ్చగాళ్లు వస్తారని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఓటడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ కే ఉందని జీఎంఆర్ చెప్పారు. రేపు ఉదయం 11 గంటలకు గణేష్ గడ్డ సిద్ది వినాయకుని వద్ద పూజలు చేసి నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు.





Total views : 147676