పేదలు గొప్పగా ఉండాలనేది తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్, నాగదేవత టెంపుల్, ఈశ్వరమ్మ బస్తీ, హమాలీ బస్తీ, చిదానందం కాలనీ తదితర ప్రాంతాలలో పాదయాత్ర గా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద మంత్రిని శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పట్టారు. ప్రచారంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈశ్వరమ్మ బస్తీ, పద్మారావు నగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కనుక మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు. నిరుపేదలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు.
Brs
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బిఆర్ఎస్ అభ్యర్ది అంజయ్య యాదవ్ షాద్ నగర్ రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే గా ఉన్న 9.5 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో షాద్ నగర్ ను ఎప్పుడు లేనంతగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని, ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. తెలంగాణ లో రైతులు, సామాన్యులు, అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలని, అభివృద్ధి ని చూసి కేసీఆర్ ని నమ్ముతున్నారని మరోసారి తెలంగాణ లో BRS ప్రభుత్వం వస్తుందని అన్నారు..
కెసిఆర్ గారి ఆశీస్సులతొ మెదక్ నియోకవర్గము ను అభివృద్ధి చేశానని మెదక్ ప్రజలు మళ్లీ ఒక సారి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తానని మెదక్ brs పార్టీ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి అన్నరు, ఈ రోజు మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేసిన సందర్భంగా ఆమె విలేరులతో మాట్లాడుతూ మెదక్ అభివృద్ది కీ పాటు పడుతనని,, 2014నేటి వరకు ఎంతో అభివృద్ది చేశానని మెదక్ ప్రజల కోసం జిల్లా కావడం గొప్ప విషయం అని ఆమె అన్నారు. మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేయడం జరిగింది అని ఆమె తెలిపారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రంగంలోకి దింపింది. చెన్నూర్, బెల్లంపల్లి Mla ల తీరు పై అసంతృప్తులు, అసమ్మతి కారణంగా కారు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్య ర్థులు గెలుపే లక్ష్యంగా కారు స్పీడ్‌ను మరింత పెంచేలా సీఎం సభలు ఊపునిస్తాయని పార్టీ భావి స్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ రాకతో చెన్నూర్ నియోజకవర్గంలో జోష్ నింపుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నరు. రేపు సిర్పూర్ ఆసిఫాబాద్, బెల్లంపల్లి కెసిఆర్ సభల ద్వారా పార్టీ క్యాడర్ లో జోష్ నిప్పెందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
మహిళా రిజర్వేషన్లపై మరో పోరాటం చేస్తామని తెలంగాణ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాము చేసిన పోరాటానికి దిగి వచ్చిన కేంద్రం.. పార్లమెంట్ లో బిల్లును పాస్ చేసిందని చెప్పారు. చట్టంగా మారిన తర్వాత అమలు వాయిదా వేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దీంతో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2024 నుంచే అమలు చేయాలనే డిమాండ్ తో మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కవిత వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా న్యాయపోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై పలు పార్టీలు, సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని చెప్పారు. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో భారత్ జాగృతి తరఫున తాము ఇంప్లీడ్ అవుతామని వివరించారు.
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్… శివలింగంపై తేలు వంటి వారని అభివర్ణించారు. తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉంటుందని అన్నారు. అందుకే కేసీఆర్ అనే తేలును ఓటు అనే ఆయుధంతోనే కొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు. అహంకారానికి, ఖమ్మం ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేలా ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు.
ఓయూ విద్యార్థులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని విద్యార్థి ఉద్యమ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు దరువు ఏళ్లన్న సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో అన్నారు. ఈ మధ్యకాలం లో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థులపై చేసిన వాక్యలు వైరల్ అవుతున్నాయని ఆ వాక్యలు ఎప్పుడు చేసిన వైనప్పటికి ఈ మధ్య కాలంలో వైరల్ గా మారాయని వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లో తగిన గుణపాఠం తప్పదని అన్నారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో సమైక్య వాధ పార్టీలో ఉండి ప్రస్తుతం టిపిసిసి అధ్యక్షుడుగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి సమైక్య వాద బావాలు ఉన్న వ్యక్తి అని మండి పడ్డారు. తెలంగాణ కు కాపలాగా ఉన్న కాపలా దారులకే ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ దే విజయమని 6వ తేదీన వేములవాడ ఎల్లారెడ్డిపేట లలో జరిగే యువ ఆత్మీయ సమావేశాలకు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హాజరవుతున్నారు అని అట్టి సమ్మేళనాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. జనాభాలో అధిక శాతంగా ఉన్న వర్గాన్ని అణిచివేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్లో మీడియాతో సంజయ్ మాట్లాడారు. అణగారిన వర్గాల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఖరి మార్చుకోవాలని.. వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గమంతా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు కూడా మా పార్టీకి మద్దతిస్తున్నారన్నారు. బీసీలకు బీఆర్ఎస్ కేవలం 23, కాంగ్రెస్ 19 సీట్లే ఇచ్చాయన్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థిని ఎప్పుడూ ముందు ప్రకటించమన్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్ఠానం కలిసి ఆ అభ్యర్థిని నిర్ణయిస్తారన్నారు. ఎవరు సీఎం అని ముందుగా ప్రకటించే సిస్టమ్ బీజేపీలో లేదన్నారు. ఒకరిద్దరు చెప్తే సీఎం అయ్యే వ్యక్తిని కాదన్నారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసే చిత్తశుద్ధి గల కార్యకర్తను అని బండి సంజయ్ అన్నారు.
చెన్నూరు నియోజకవర్గం కన్నా ప్రజల సమస్యకన్న ఇసుక దందానే బాల్క సుమన్ కు ముఖ్యం అని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మందమర్రి లొ గడప గడప కు కాంగ్రెస్ ప్రచారం లొ భాగంగా మాట్లాడుతూ… రోజుకు ఎన్ని లారీలు వస్తున్నాయి ఎంత వాటా వస్తుంది అనేదే సుమన్ లక్ష్యం. 2014 లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన పై పోటీ చేసినప్పుడు 100 కోట్లు వివేక్ వి 100 కేసులు నాయంటూ ప్రజలని మభ్యపెట్టిండు. Mp గా mla గా గెలిచి వెయ్యి కోట్లు బాల్క సుమన్ ఎట్ల సంపాదించిండని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాలను తెలుసుకుని బాల్క సుమన్ ను నిలదియ్యాలి. నేను ఏ పదవిలో లేనప్పటికి 10 ఏండ్లుగా ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటు అండగా ఉంటున్న ప్రజలకు సేవ చేసేందుకె చెన్నూరు అసెంబ్లీ బరిలో నిలుచుంటున్న హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సుమన్ అహంకారం తో ఆఫీసర్లను , నాయకులను, ప్రజలను తిట్టడం బెదిరింపులకు దిగడమే పని. పేదలకు డబులు బెడ్ రూమ్ లు ఇయలేదు గాని కేసీఆర్ తన mla, mp లకు పెద్ద బిల్డింగ్ లు కట్టి ఇచ్చిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..మందమర్రి మున్సిపాలిటీ కి ఎన్నికలు జరిపించేందుకు కృషి చేస్తాను అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తా అని తన ఇంటికే ఆరు ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు. నెలకు 50 లక్షల జీతం కేసీఆర్ కుటుంబ సభ్యులకు వస్తున్నాయి కేసీఆర్ బులెట్ ప్రూఫ్ ఇల్లు కట్టుకున్నాడు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇళ్ళలు, ఫామ్ హౌజ్ లు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పెదలకేమో డబుల్ బెడ్ రూమ్ లు లేవు. ముఖ్యమంత్రి కి అహంకారం పెరిగింది.. అవినీతిలో మునిగిపోయిండు మీటింగ్ లో నెను ఎక్కడ మాట్లాడిన అక్కడ బాల్క సుమన్ మనుషులు కరెంట్ కట్ చేస్తున్నారు. పవర్ కట్ చేస్తే.. నా మాటలు మీ దాకా వినిపియ్యవా. ధరణి ,కాళేశ్వరం, మిషిన్ భగీరథ ఇలా ప్రతి దానిలో కోట్లు కొల్లగొట్టారు. కాంగ్రెస్ మేనిపెస్టో లొ ఆరు గ్యారెంటీ కార్డును ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అన్నారు.



Total views : 92554