బీఆర్ఎస్ నేత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని సూరంపల్లిలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి ఎంపీపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి కడుపు భాగంలో గాయమైనట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన బీఆర్ఎస్ కార్యకర్తలు హుటాహుటిన ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఎంపీపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలు చితకబాదారు. అనంతరం ఎంపీపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎంపీపై దాడికి పాల్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక, ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు.
Brs
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం ఎంపీపీ పెండెం సుజాతను మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తంకుమార్ రెడ్డి అలాగే మండల కేంద్రంలోని సర్పంచులు వారి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు… ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బారస ప్రభుత్వం ను తరిమి కొట్టాలిసిన సమయం వచ్చింది.. Mla నుంచి సీఎం దాకా రాష్ట్రమును దోచుకున్నారు..నవంబర్ 3 న కాని అంతకు ముందు కాని రైతు బంధు ఇవ్వాలని చూచించాను… కానీ కేసీఆర్ మాత్రం మాట మార్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వవద్దని అనడం హాస్యాస్పదం.. స్థానిక mla వైన్స్ మీద కూడా కమిషన్ తీసుకొని దోచుకుంటున్నారు.. దళిత బంధు కూడా ఇవ్వాలని చెప్పాను.. దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా mla మాత్రం 300 ఎకరాలు దోచుకున్నాడు… ప్రభుత్వం అన్ని రకాల వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసింది… 6నెలల క్రితం చెప్పిన హుజుర్ నగర్ నుంచి 50 వేల మెజారిటీ వస్తుందని.. డిసెంబర్ లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు కైవసం చేసుకుంటుంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరువాత 6 గ్యారెంటీ పథకాలు అమలు చేస్తాము… కాంగ్రెస్ పార్టీ హయాంలో లక్షల ఇండ్లు కట్టించినము..ఇప్పుడు ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 100 గజాల స్థలంతో పాటు ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తాము… మీరే మాకు కుటుంబ సభ్యులు, మీరే మాకు పిల్లలు.. 24 గంటలు ప్రజల కోసం పాటుపడుతున్నాము… 5 సార్లు mla గా ప్రస్తుతం ఎంపీ గా ఉన్న 6వ సారి mla అవుతా చిన్నదో,పెద్దదో పదవి వస్తుంది..అందరికి అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తాను… నేను ఏ ఒక్క రోజు ప్రజలను ఇబ్బంది పెట్టలేదు.. బై బై కేసీఆర్, బై బై సైదిరెడ్డి.. మీరందరూ నన్ను ఆశీర్వదించండి మీ నమ్మకానీ నేను వమ్ము చేయను…
అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి మాట ఇచ్చి… ఆ మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. సంగారెడ్డిలో విజయభేరి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీస్ అమలవుతున్నాయని… ఈ విషయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్, కేటీఆర్ వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.. ఇందిరాగాంధీ గతంలో మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారానికి వచ్చి హామీ ఇచ్చినట్లుగానే బీహెచ్ ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను పెట్టారని.. ఇదీ వారు ఒక మాట ఇస్తే నెరవేర్చుకునే మంచి వ్యక్తిత్వానికి నిదర్శమన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణలో అమలవుతాయన్నారు. రాష్ట్రం ఏర్ప డేటప్పుడు మిగులు బడ్జెట్ తొమ్మిదేళ్లలో ఉంటే అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్ పరిపాలన తీరును విమర్శించారు. అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..జగ్గారెడ్డిని సంగారెడ్డి లో50వేల అధిక్యంతో గెలిపించాలని కోరారు..జగ్గన్న.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.పని మంతుడు పందిరి వేస్తె కుక్క తోక తాకి కూలిందంట. మేడిగడ్డ పరిస్థితి అట్లుంది. వీళ్లను కొరడాతో కొట్టాలి. జైల్లో వేసి చిప్ప కూడు తినిపించాలి. అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలంలో పర్యటించారు. ఆయన దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునుగోడు క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాజ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ
కెసిఆర్ కుటుంబ పాలన కు చరమగీతం పాడడానికే ఆనాడు బీజేపీలోకి వెళ్లానన్నారు. నేడు కాంగ్రెస్ లోకి వచ్చానన్నారు. ఏ పార్టీలోకి వెళ్లిన నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దించడమేనన్నారు. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పన్నెండు మంది కెసిఆర్ బిఆర్ఎస్ లోకి చేర్చుకున్నాడన్నారు. నా పోరాటం ఆరోజే మొదలైందిని, కేసీఆర్ ని గద్దెదించడం నా ప్రధాన లక్ష్యమైందన్నారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుందని, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు.
ఖమ్మంజిల్లా మునిగేపల్లిలో బిఆర్ఎస్ పాలేరు నియోజక వర్గ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయనకు పార్టీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి గుడిలో కందాల ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రచారం ప్రారంభించారు.ఈ సందర్బంగా కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ చెప్పింది చేసేది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా నన్నారు. త్వరలోనే దళితులందరికి దళిత బంధు అందజేస్తామని చెప్పారు. రాష్ట్రాని అభివృద్ధి పధంలో ఉంచిన బిఆర్ఎస్ ని మూడోసారి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, ధరణి పోర్టల్ తీసేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్…కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. రైతు బంధు వృథా అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని, ధరణి పోర్టల్ తీసేస్తామని భట్టి విక్రమార్త చెబుతున్నారన్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు, రైతు బీమా ఎలా వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తోదన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి కర్ణాటకలో రైతులకు 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిశారు. కాంగ్రెస్ పార్టీ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన్ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు గచ్చిబౌలిలోని నాగం నివాసం వద్దకు వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రుల వెంట పలువురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. రాష్ట్రంలో సీనియర్ నేతగా పేరున్న ఆయనకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేశ్‌రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు వివరించారు. త్వరలోనే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఆయన్ను కలవడం ఆసక్తికరంగా మారింది.
మరో నాలుగు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వెళ్లడం, ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ ల ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. నాగం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారన్నది ఇంకా తెలియరాలేదు.
తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని… అయితే, ఇలాంటి ప్రయోగాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆ రాష్ట్రంలో పర్యటిస్తానని తెలిపారు. కర్ణాటక ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను చూసేందుకు, వాటి గురించి తెలుసుకునేందుకు తెలంగాణ నుంచి ఎవరైనా రావచ్చని చెప్పారు. అక్కడి సంక్షేమ పథకాలపై ఎవరైనా అసంతృప్తిని వ్యక్తం చేస్తే… లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని అన్నారు. ఈ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలికేందుకే వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను ప్రతి గ్రామంలో ప్రచారం చేసి రాష్ట్రంలో ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
ఖమ్మం వాకర్స్ అసోసియేన్ సీనియర్ సిటిజన్స్ కోరుకునే విధంగా ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భగా తుమ్మల మాట్లాడుతూ.. మనం ఆరోగ్యంగా ఉంటూ సమాజం ఆరోగ్యంగా ఉండేలా పాటుపడాలని.. కలుషిత రాజకీయాలను దూరం చేసి మానసికంగా దృఢంగా ఉండేలా అడుగులు వేయాలని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లో పాలేరు నుంచి పాపికొండల వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం దక్కిందని.. నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల కోరారు. బీఆర్ఎస్ పాలనలో ఖమ్మంలో అభివృద్ధి శూన్యమని.. జిల్లాలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.




Total views : 92164