డిజిటల్ చెల్లింపుల సంస్థ PhonePe అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా యెస్ బ్యాంక్ మాజీ ఎగ్జిక్యూటివ్ రితీష్ పాయ్ ని నియమించినట్లు ఒక ప్రకటన లో పేర్కొంది. ఆయన ఇంతకు ముందు TerraPay లో ఉత్పత్తులు, పరిష్కారాల విభాగానికి అధ్యక్షుడిగా పనిచేసారు. అలాగే యెస్ బ్యాంకు లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ గా కూడా పనిచేసారు. అక్కడ డిజిటల్ చెల్లింపుల విభాగం లో కీలక పాత్ర పోషించారు.
CEO
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, సీఈవోలు ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్లు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. సాధారణ నేర కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో మాట్లాడి సరిహద్దు చెక్ పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు. రాష్ట్రంలో నిఘా మరింత పెంచామన్నారు. ఇప్పటి వరకు రూ.385 కోట్ల మేర నగదును జప్తు చేసినట్లు చెప్పారు. 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామన్నారు. తెలంగాణ సరిహద్దులోని పదిహేడు జిల్లాల్లో 166 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సరిహద్దుల్లోని పొరుగు రాష్ట్రాల్లో 154 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేసి, అప్రమత్తంగా ఉండాలని సూచిన్నట్లు తెలిపారు.





Total views : 78549