ఏపీలో రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై కొత్త కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై తాజా నిర్ణయం ప్రకటించారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటోతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో కొత్త విధానం అమలు కానుంది.కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పట్టాదారు పాసు పుస్తకాలపై ఇవాళ కీలక ప్రకటన చేశారు. పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్ర వేసి ఇస్తాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టాదారు పాసు పుస్తకాలను మారుస్తామని గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మార్పులు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలిసారి అప్పటి సీఎం జగన్ బొమ్మతో ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. దీనిపై అభ్యంతరాలు వచ్చినా అప్పట్లో పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఆ బొమ్మనుతీసేసి రాజముద్ర పెడతామని చంద్రబాబు ప్రకటించారు.మీ తాత ముత్తాతలు సంపాదించిన భూమికి ఇచ్చే పాస్ పుస్తకంపై గత ప్రభుత్వం జగన్ బొమ్మ వేసుకుందని ప్రజలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు భూమికి తన బొమ్మ వేసుకోవాలా అని వారిని ప్రశ్నించారు. తాను అలా వేసుకోనని, అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలనూ మారుస్తానని తెలిపారు. బొమ్మ తీసేస్తానని, రాజముద్రతో మీ భూములు మీకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. త్వరలో ఈ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 195633