తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అధిష్ఠానం పిలుపుతో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ చేరుకోవడానికి ముందే ముఖ్యమంత్రిగా రేవంత్ పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఈ ఉదయం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సీఎల్పీ నేతగా తనను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరికాసేపట్లో పార్టీ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అవుతారు. మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై వారితో చర్చిస్తారు. అలాగే, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానిస్తారని సమాచారం.
cvr telugu
మిచాంగ్ తుఫాన్ పోతూ పోతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. తీరం దాటే సమయంలో వీచిన బలమైన ఈదురు గాలులకు మండలంలోని రుస్తుం బాధ, లిఖితపూడి, భీమవరం రోడ్డులో భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు 30కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు ఇళ్ల పైకప్పులపై పడ్డాయి. దీంతో చాలా గ్రామాలలో అంధకారం నిండిపోయింది. వర్ష తీవ్రత పెరిగింది. సముద్రంలో అలలు ఎగిసి పడుతుండడంతో ప్రజలలో ఇంకా తుఫాన్ భయం వీడలేదు.
కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. పర్యాటక శాఖ మంత్రి, ఎండీకి తెలిసే ఈ అవినీతి జరిగింది. ప్రభుత్వం మారిందని అడ్మినిస్ర్టేషన్ కార్యాలయాన్ని తగలబెట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది. ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదని నారాయణ వ్యాఖ్యానించారు.
ఏపీ రాజధాని అమరావతేనని, కేంద్రం అభివృద్ధి చేయదలుచుకున్న రాజధానుల మాస్టర్ ప్లాన్ లో అమరావతి పేరు ఉందని నిన్న రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కుమార్ ప్రకటన చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కేంద్రం మరోమారు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్ మోహన్ రెడ్డి గారూ అంటూ ఎక్స్ లో వ్యాఖ్యానించారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కార్యాలయాల మార్పు కుదరదని చెప్పిన తీర్పును గౌరవించకుండా. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణను కారణంగా చూపుతూ క్యాంపు కార్యాలయాల పేరుతో విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించవలసిన అవసరం ఏమొచ్చిందని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
మెట్రో నగరాల్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాచపి జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించింది. 2022లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 24శాతం సైబర్ క్రైం 2020-22 రెండేళ్లకు గాను వెల్లడించిన గణాంకాల్లో ఐపీసీ నేరాలు ఇతర నేరాలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ సైబర్ నేరాల్లో మాత్రం హైదరాబాద్ ప్రథమస్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ పలు నేరాల్లోనూ ప్రథమ స్థానంలో ఉంది. హత్యలు, దోపిడీల్లాంటి నేరాల్లో హైదరాబాద్ సిటీ కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు గుప్పించే సినీ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంపై సెటైర్లు వేశాడు. పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ఎక్స్ వేదికగా స్పందించాడు. ఆర్యభట్ట గణితశాస్ర్తంలో సున్నాని ఆవిష్కరించాడు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో సున్నాని కనిపెట్టాడు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన విఫలమైన నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. బీజేపీతో పొత్తుపెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. మొత్తం 8 స్థానాల్లో పోటీ చేయగా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయింది. కూకట్పల్లి నుంచి పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌కు మాత్రమే చెప్పుకోదగ్గట్టుగా సుమారు 40 వేల ఓట్లు పడ్డాయి. మిగతా ఏడు చోట్ల అభ్యర్థులకు పెద్దగా ఓట్లు పడలేదు. కూకట్‌పల్లితోపాటు ఖమ్మం, నాగర్‌కర్నూలు, కోదాడ, కొత్తగూడెం, వైరా, తాండూరు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దింపింది. పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేసినా పెద్దగా ఓట్లు పడలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్సార్సీపీ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్‌గోపాల్ వర్మ కూడా ఇదే తరహాలో స్పందించాడు.
Read Also..
Read Also..
పూర్వం రోజంతా కష్టపడి ఇంటికి వచ్చినవారు సాయంత్రం 7 గంటల కల్లా భోజనం చేసి 8 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించేవారు. మళ్లీ ఉదయమే 5 గంటల కల్లా నిద్రలేచి వారివారి పనుల్లో నిమగ్నమయ్యేవారు. అప్పుడు కష్టంతోపాటు తగిన విశ్రాంతి కూడా తీసుకునేవారు కాబట్టి అప్పటివారు ఆరోగ్యంగా ఉండేవారు. మంచి ఆహారం కూడా తీసుకునేవారు. కానీ కాలం మారిపోయింది. మనుషులు కాలం వెంట పరుగెడుతూ ఉన్నారు. ఆఫీస్‌లో కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ గడిపి ఇంటికి వచ్చాకా టీవీ, మొబైల్ ఫోన్లతో బిజీ అయిపోతున్నారు. రాత్రిళ్లు 11 లేదా 12 గంటలు దాటితేగాని నిద్రపోరు. పడుకున్నా ఉదయాన్నే ఆఫీసులకు పోవాలి కాబట్టి ఉదయం 6 లేదా 7 గంటలకు నిద్రలేస్తారు. అంటే వారు నిద్రపోయే సమయం కేవలం 6 లేదా 7 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు ‘ఆరోగ్యకరమైన నిద్రకు. ఆరు సూత్రాలు’ పాటిస్తే సరిపోతుంది. పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒత్తిడి, ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల హాయిగా నిద్రపోవచ్చు. రాత్రి భోజనంలో మజ్జిగ తీసుకోవడం ద్వారా కూడా చక్కగా నిద్ర పడుతుంది. మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది. రాత్రిపూట అరటిపండు తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఫలితంగా మంచి నిద్ర పోవచ్చు. బాదం పప్పు తీసుకోవడం కండరాలు, మనసు రిలాక్స్ అవుతాయి. తద్వారా చక్కని నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. పడుకునే ముందు చెర్రీపండ్లు తిన్నా లేదా జ్యూస్ తాగినా అందులో ఉండే ‘మెలటోనిన్’ వల్ల చక్కగా నిద్ర పడుతుంది. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కనీసం 6 గంటలైనా ప్రశాంతంగా నిద్రపోవాలనుకునేవారు పై నియమాలు పాటిస్తే సరిపోతుంది. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాడా పడుతుంది. పాలలో ఉండే న్యూరో ట్రాన్స్‌మీటర్స్ ఇవి మనసుకు ప్రశాంతతను చేకూర్చి. చక్కగా నిద్రపోయేలా చేస్తాయి.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్ డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది. గైడ్ బండ్ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం సీరియస్ నెస్ లేదని అర్ధమౌతోందని వ్యాఖ్యానించింది. మరో 15 రోజుల్లో తిరిగి సమావేశం కావాలని , అప్పటికి నిర్ధేశించిన అంశాల్లో కొన్ని పూర్తి చేసుకుని రావాలని ఆదేశించింది. ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ సమావేశం నిర్వహించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన రేపు సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం కావాలని అధిష్ఠానానికి సూచించారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం గురించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. 1969 – నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జననం, 2006 – మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్, 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా, 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియామకం, 2021 జులై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం. 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
మారిన ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం చాలా మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అనేది సర్వసాధారణమైంది. చిన్నగా ప్రారంభమయ్యే సమస్యలే క్రమేపీ దీర్ఘకాలిక వ్యాధులుగా మారుతున్నాయి. దీని వల్ల చికిత్స మరింత కష్టసాధ్యమవుతుంది. అయితే గ్యాస్ సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడే స్పందిస్తే ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. పుదీనా ఆకులతో తయారుచేసిన టీ కూడా గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. చిన్న అల్లం ముక్కని భోజనం ముందు తింటూ ఉంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉదయాన్నే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లలో కలిపి తాగితే క్రమంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.టేబుల్ స్పూను జీలకర్ర పొడిని ఏదో ఒక ఆహారంలో చేర్చుకుని తీసుకుంటే అనుకోకుండా ఎదురయ్యే గ్యాస్ సమస్య నెమ్మదిస్తుంది.ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకున్నా గ్యాస్ సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు.
Read Also..
Read Also..