వైజాగ్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి టీడీపీ ఎంపీ కె. రామ్మోహన్నాయుడు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారైంది. 106.89 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మంజూరు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం 10 కోట్ల రూపాయలు కేటాయించాం. భూసర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే అవుట్ ప్లాన్ తయారీ బాధ్యతలను తూర్పుకోస్తా రైల్వే జోన్‌కు అప్పగించాం. బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందున దానికి బదులుగా ముడసర్లవోలో 52.2 ఎకరాల భూమిని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేకు అప్పగించాల్సిన ఉంది. ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి, రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంది అని అశ్వినీ వైష్టవ్ తెలిపారు. వైజాగ్ జంక్షన్-గోపాలపట్నం మధ్య 15.31 కిలోమీటర్ల మేర 159.47 కోట్ల రూపాయలతో 3,4 లైన్ల నిర్మాణం కోసం 2023 ఏప్రిల్‌లో అనుమతులు మంజూరుచేసినట్టు రైల్వే మంత్రి పేర్కొన్నారు.
cvr telugu
తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టింది. సర్పంచుల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 31న ముగియనుంది. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహించే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించి సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలతో జిల్లాల వారీగా రిపోర్ట్ సిద్ధం చేయాలంటూ కలెక్టర్లకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ ఈ మేరకు లేఖ పంపించారు. డిసెంబర్ 30లోపు కసరత్తు పూర్తిచేసి వివరాలు అందించాలని కోరారు. ఓటర్ల సంఖ్యను బట్టి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఎంపిక, పోలింగ్ సిబ్బంది. రాండమైజేషన్ సిస్టమ్ సాప్ట్వేర్ అప్లికేషన్లో వివరాల నమోదు చేయడం వంటి వాటిపై కలెక్టర్లకు కీలకమైన సూచనలు చేశారు. సర్పంచ్, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శులు ఎన్నికల సంఘానికి పంపించారు. తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలు, లక్షా 13 వేలకు పైగా వార్డులు ఉన్నాయి. అయితే ఇవి ముందస్తు ఏర్పాట్లు మాత్రమేనని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనేది నూతనంగా ఏర్పడబోయే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన కొద్ది రోజులకే తెలంగాణ ఎన్నికల కసరత్తు మొదలవ్వడం గమనార్హం.
ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు శరీరానికి అందాల్సిందే. ఏ ఒక్క విటమిన్ లోపించినా. శరీరం అనారోగ్యానికి గురికావాల్సిందే. ఇక విటమిన్ ‘డి’ గురించి చెప్పనక్కరలేదు. దీని అవసరం శరీరానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే. విటమిన్-డి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. దీని లోపం వల్ల మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ‘విటమిన్-డి’ తక్కువగా ఉండటం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా స్త్రీలతో ఈ సమస్య నానాటికి పెరుగుతూనే ఉంది. ఎముకలకు కావాల్సిన క్యాల్షియమ్‌ను శోషించుకోవడానికి, కండరాలు బలహీనం కాకుండా రక్షించడానికి విటమిన్-డి తోడ్పడుతుంది. ‘విటమిన్-డి’ని సూర్యకాంతి నుంచి సులభంగా పొందవచ్చు. అలా కాని పక్షంలో డాక్టర్ సూచనతో విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. శరీరంలో విటమిన్-డి తక్కువైతే. నీరసం, నడుము నొప్పి, జుట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్-డి లోపం వల్ల కండరాల బలహీనత, డిప్రెషన్ విటమిన్-డి సమస్యలు వేధిస్తాయి. ఎముకల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మెదడు పనితీరుపైనా దీని ప్రభావం ఉంటుంది. గుండె పనితీరు చురుకుగా ఉండటంలో విటమిన్-డి ప్రధానపాత్ర పోషిస్తోంది. అధిక రక్తపోటు సమస్యలున్నవారు ‘విటమిన్-డి’ అశ్రద్ధ చేయకూడదు. బద్దకం, అలసట, నిరుస్సాహం, కోపం వంటి లక్షణాలు కూడా విటమిన్-డి లోపానికి సంకేతాలు. శరీరానికి అవసరమైన ‘డి’ విటమిన్ తీసుకోవడం వల్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాము. గుడ్డులో పసుపు సొన, ఆర్గాన్ మీట్స్, ఆయిల్స్, పాలు, ఛీజ్, పన్నీర్, నెయ్యి, వెన్నలో ‘విటమిన్-డి’ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పుట్టగొడుగులో విటమిన్ డి సమృద్ధిగా దొరుకుతుంది. తరచుగా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ ఒక గుడ్డు పూర్తిగా తీసుకుంటే విటమిన్-డి లోపం రాదు. శరీరంలో విటమిన్ ‘డి’ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఉదయపు ఎండలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకుంటే విటమిన్-డి లోపాలు ఉండవు. ఎండలో నడవడం, వ్యాయామం చెయ్యడం లాంటివి చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. విటమిన్ డి లోపం ఉన్నవారు డాక్టర్ సూచనతో సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఎక్కవగా తీసుకున్న ప్రమాదమే.
భారతదేశంలో నమ్మశక్యం కానీ వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ భజిస్తారు, కొన్ని చోట్ల దెయ్యాల్ని వదిలిస్తారు, మరికొన్ని చోట్ల భక్తులు తలలు పగలకొట్టుకుని రక్తాన్ని చిందిస్తారు. ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు మనం చూడవచ్చు. కానీ విచిత్రమైన, అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలం. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం. అసలు ఈ అసాధారణ దేవాలయాల విశేషాలు ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. మహేందిపుర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్ :
రాజస్థాన్ లోని డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దెయ్యాల్ని, ఆత్మల్ని వదిలించుకోవడానికి వస్తుంటారు. వీపరీతమైన చర్యల ద్వారా, ఉదాహరణకు శరీరంపై వేడి నీరు పోయడం, పై కప్పు నుంచి వేలాడదీయడం, గోడలకు తలను కొట్టడం, గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటివి దుష్టశక్తుల నుంచి బాధితున్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు. భారతదేశంలో ఇప్పటికీ భూతవైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతారు. ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు.
2. కామఖ్య దేవి ఆలయం, అస్సాం :
అస్సాంలోని గువహతిలో ఉన్న నీలాచల్ కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయం ఉంది. భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలందుకుంటుంది. దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతుంటారు. ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ దేవత రుతుక్రమం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసి వేస్తారు. ఆలయం తెరిచే నాల్గవ రోజు వరకూ ఇక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా అంబుబచి మేళాను జరుపుతుంటారు. ఈ మూడు రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెబుతారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తుంటారు.
3. దేవ్ జీ మహరాజ్ మందిర్, మధ్య ప్రదేశ్ :
ప్రతి నెలా పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను, దుష్ట శక్తులను వదిలించుకోవడానికి మధ్య ప్రదేశ్ లోని దేవ్ జీ మహరాజ్ ఆలయానికి వస్తుంటారు. దుష్ట శక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడి సాధారణ పద్ధతి. వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపురుతో కొట్టడం వంటివి కూడా చేస్తుంటారు. దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ ‘భూత్ మేళా’ లేదా ‘దెయ్యాల ఉత్సవం’ నిర్వహిస్తుంటారు. భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది ఒకటి.
4. కాలభైరవనాథ్ దేవాలయం, వారణాసి :
పవిత్ర వారణాసి నగరంలో గల కాల భైరవ్ నాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఇక్కడ నమ్మశక్యం కానీ నిజం ఏమిటంటే కాల భైరవ్ నాథ్ కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, స్వీట్స్ ను అమ్ముతుంటారు. కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం.
5. కొడంగల్లూర్ భగవతి ఆలయం, కేరళ :
కాళీ దేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళి దేవికి కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ప్రతి ఏటా ఏడు రోజుల వింత భరణి పండుగ నిర్వహిస్తుంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి, కత్తులు పట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతుంటారు. రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు. ఆ తరువాత ఆలయం స్తంభాలను కర్రలతో పదేపదే కొడతారు. పండుగ తరువాత 7 రోజులు ఆలయాన్ని మూసి వేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు.
6. స్తంభేశ్వర్ మహదేవ్, గుజరాత్ :
మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా? గుజరాత్ లోని వడోదరకు దగ్గర్లో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం అటువంటిదే. ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతారు. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటి. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యపడుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్లి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు. మరలా కొన్ని గంటల తరువాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తారు.
7. బ్రహ్మ ఆలయం, పుష్కర్, రాజస్థాన్ :
ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబు కంట పడినా కూడా నేటికీ చెక్కుచెదరక మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మ దేవుని ఆలయం ఒకటి. ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం ఇదే. హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేకపోవడం విశేషం. పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇవి దాతలు, భక్తుల పేర్లతో కనిపిస్తాయి.
8. దేవరగట్టు ఆలయం, ఆంధ్రప్రదేశ్ :
భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకూఒకరి తలలపై ఒకరు కొట్టుకుంటారు. ఇక్కడి మాల మల్లేశ్వరుడు (శివుడు) చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకు బదులు గొడ్డలి, బాకులను వాడే వారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో రేవంత్ చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గురువారం మధ్యాహ్నం జరగనున్న ప్రమాణస్వీకారానికి రావాలని ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. అలాగే ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు చంద్రబాబునాయుడుకి, కెసిఆర్ ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు. వీరితోపాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకూ టీపీసీసీ ఆహ్వానం పంపింది. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, కంచె ఐలయ్యతో పాటు వివిధ కుల సంఘాల నేతలు, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.
ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ డేటా, సేఫ్టీ కోసం పాస్వర్డ్స్ వాడుతుంటారు. అయితే వీక్ పాస్వర్డ్స్ వాడే వారు చాలా మందే ఉన్నారు. వీటిని ఒక్క సెకనులోపే హ్యాక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. వీక్ పాస్వర్డ్స్ జాబితాలో మీరు కూడా ఉన్నారేమో ఇప్పుడే చూసెయ్యండి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిదీ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. గుండుసూది నుంచి గుమ్మడికాయ దాకా ఏది కావాలన్నా ఒక క్లిక్‌తో ఆన్‌టైమ్‌లో మన కళ్ల ముందు వచ్చి వాలిపోతుంది. టెక్నాలజీలో గణనీయమైన మార్పులు రావడంతో ప్రతి ఒక్కరూ మనీ ట్రాన్సాక్షన్స్ ఇతర వ్యవహారాలను ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ నుంచే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫోన్లకు పాస్వర్డ్స్ క్రియేట్ చేస్తుంటారు. ఇవి ఫోన్ డేటాతో పాటు ఇతర వివరాలను సురక్షితంగా ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే కొందరు ఆ పాస్వర్డ్స్ సరైన జాగ్రత్తలు తీసుకుంటుండగా.. కొందరికీ వాటి గురించి ఇప్పటికీ తెలియదు. దీంతో వీక్ పాస్వర్డ్స్ వాడుతున్నారు. ఇలా 2023లో ప్రజలు ప్రధానంగా ఎలాంటి పాస్వర్డ్స్ వాడుతున్నారనే దానిపై నార్డ్‌పాస్ ఒక నివేదికను ప్రచురించింది. ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్ రంగంలోనే కాకుండా Google, Facebook, Twitter, Instagram వంటి అకౌంట్లలో వ్యక్తిగత డేటాను చోరీ చేసేందుకు సైబర్ ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వీరు చోరీ చేయాలంటే ముందుగా మన అకౌంట్, పాస్వర్స్ గురించి తెలియాలి. కాబట్టి మనం ఎక్కువగా ఎలాంటి పాస్వర్డ్స్ పెడతామో తెలుసుకుని వాటి నుంచి డేటా తస్కరించేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మనం బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. పైన చెప్పిన జాబితాలో మీ పాస్వర్డ్ ఉంటే దాదాపు ఒక సెకనులోపే హ్యాక్ చేయొచ్చు. హ్యాకర్లకు ఒక పాస్వర్డ్ హ్యాక్ చేసేందుకు 17 నిమిషాల సమయం పడుతుంది. ఈ సందర్భంలో స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మీరు లాగిన్ చేస్తున్న యాప్ లేదా వెబ్‌సైట్‌కి కనీసం 8 అక్షరాల నిబంధన ఉంటే, అందులో ఇంగ్లీష్ స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, నెంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లు ఉండేలా క్రియేట్ చేయండి. లేదంటే క్లిష్టంగా ఉండి. మీరు గుర్తుంచుకునే పాస్‌వర్డ్స్‌ను రూపొందించండి. కేవలం నెంబర్లు, పదాలతో కూడిన సాధారణ పాస్వర్డ్ ఎప్పటికీ రూపొందించకండి.
తుఫాన్ ప్రభావంతో వేలాదిమంది నిరశ్రయులయ్యారని, రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాపూరావు తెలిపారు. పదివేల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయంగా 5000 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. ముంపు ప్రాంత వాసులకు కనీసం ఆహారాన్ని కూడా అందించలేకపోయారని ఆరోపించారు. పంటలు నష్టపోయిన రైతులకు పూర్తి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకే శివకుమార్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిప్యూటీ సీఎం, మంత్రి పదవులుతో నేడు హై కమాండ్ స్పష్టత ఇవ్వనుండటంతో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని డీకేను ఇద్దరు నేతులు కోరినట్లు తెలిసింది. కాసేపటి క్రితం ఉత్తమ్ వెళ్లిపోగా ఇంకా భట్టి డీకేతో చర్చలు సాగిస్తున్నారు. ఓ వైపు రేవంత్ ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్న వేళ ఈ భేటీ ఉత్కంఠను రేపుతోంది.
Read Also..
Read Also..
మిచాంగ్ తుఫాన్ కారణంగా ఏపి రాష్ట్రవ్యాప్తంగా భారీగా పంట నష్టం జరిగింది. జగ్గయ్యపేట మండలం రామచంద్రుని పేట గ్రామంలో జరిగింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వరి పొలాలు పూర్తిగా నీట మునిగాయి. చేతికి వచ్చిన పంట నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి చేతికి వచ్చిన పంట నీట మునగడంతో రైతులు అయోమయ స్థితిలో పడ్డారు. పంట నష్టం జరిగిందని అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. పంట నష్టం అంచనా వేయమని రైతుభరోసా కేంద్రాలను సంప్రదిస్తే మాకు ఉన్నతాధికారుల నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని చెపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also..
Read Also..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి భార్యాభర్తలు మృతి చెందారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలింది. ఇంట్లో నిద్రిస్తున్న నూకతోటి పుల్లారావు, లక్ష్మీల పై పడింది. గోడ కూలిన శబ్దం విన్న స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే భార్యాభర్తలు మృతి చెందారు. జరిగిన ఘటన పై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.