ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపు అధికమంది మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై ఢిల్లీలో జోరుగా చర్చలు జరుపుతోంది. దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? అనే అంశంపై ఓ డిజిటల్ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆరు లక్షలమంది పాల్గొన్నారు. ఇందులో మెజార్టీ సభ్యులు రేవంత్ రెడ్డి పేరును సూచించారు. డిజిటల్ మార్గంలో జరిగిన ఈ సర్వేలో 73 శాతం మంది రేవంత్ రెడ్డి, 16 శాతం మంది మల్లు భట్టి విక్రమార్కకు అనుకూలంగా ఓటు వేశారు. ఐదు శాతం మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడు శాతం మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు వైపు మొగ్గు చూపారు.
cvr telugu
మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సెంటర్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో అరటిపంట ధ్వంసమైంది. నేతివారిపల్లి, నగరిపాడు పరిధిలో 25 వేల అరటిచెట్లు నేలకూలాయి. గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యుత్, టెలికామ్ సేవలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరడంతో 12 గేట్లను ఎత్తి 10000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. గూడూరు, చవటిపాలెం, పురిటిపాలెం, విందురు, చిల్లకూర్లను వరద నీరు చుట్టుముట్టింది. నీళ్లు,ఆహారం కోసం గిరిజన గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read Also..
Read Also..
సిరివెళ్ల మండలం వంకిందిన్నే గ్రామానికి చెందిన కొకల ప్రసాద్ నంద్యాలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. తెల్లవారుజామున సెక్యూరిటీ, వైద్య సిబ్బంది ఆదమరచి నిద్రపోతున్న సమయంలో ఆస్పత్రిలోకి ప్రవేశించాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్నాడు కోకల ప్రసాద్. కొద్దిసేపు వార్డులన్నీ నిశితంగా పరిశీలించాడు. అనంతరం స్ర్తీల మెడికల్ వార్డులోకి ప్రవేశించి తాను వైద్యుడనని. రోగులకు పరీక్షలు చేయాలని అటెండర్స్ ను బయటికు పంపించాడు. తర్వాత పేషంట్ల కేసు షీట్లను. తీసుకొని రోగుల వద్దకు వెళ్లాడు. వైద్య పరీక్షలు చేస్తున్నట్లు నటిస్తూ, మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేమిటిని ప్రశ్నించిన ఓ రోగి భర్తపై ఆగ్రహంతో బయటకి పంపించేశాడు ఫేక్ డాక్టర్ ప్రసాద్. అనుమానించిన వైద్య సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది పట్టుకొని నిలదీశారు. కానీ తాను డాక్టర్ నని బుకాయించాడు ప్రసాద్. దీంతో ఆస్పత్రి సిబ్బంది అంతా కలిసి అతన్ని చితకవాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. 4రోజుల జైలు శిక్ష విధించారు మెజిస్ట్రేట్ రాంభూపాల్ రెడ్డి. వెంటనే అతన్ని పోలీసులు నంద్యాల సబ్ జైలుకు పంపించారు.
లవంగాలు రుచికి ఘాటుగా ఉన్నప్పటికీ. ఆరోగ్యానికి దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పలు అనారోగ్య సమస్యలకు లవంగాలు చక్కని మందుగా పనిచేస్తాయి. అందుకేనేమో మన పెద్దలు దీన్ని వంటల్లో భాగం చేశారు. అంతటి ప్రాముఖ్యం గల లవంగాలు. ఏయే అనారోగ్య సమస్యలను ఏవిధంగా నయం చేస్తాయో తెలుసుకుందాం. లవంగాలు దంత సమస్యలను దూరంచేస్తాయి. పంటి నొప్పులు ఉన్నవారు లవంగాలను ఇలా తింటే ఫలితం ఉంటుంది. ఇవి నోటి దుర్వాసనను పోగొడతాయి. పడుకునే ముందు నోట్లో లవంగం వేసుకుని పడుకోవాలి. ఉదయం బ్రష్ చేసేప్పుడు నోట్లోని లవంగంతో చిగుళ్లను తోమాలి. ఆహారం జీర్ణం కానివారు భోజనం చేయగానే ఓ లవంగం నోట్లో వేసుకుని నమిలితే చాలు. ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. దీంతోపాటు గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. వాంతులు, వికారం వంటి లక్షణాలుఉన్నవారు. లవంగాలకు కొద్దిగా తేనె కలిపి తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు. లవంగాల కషాయం తాగితే ఉపశమనం కలుగుతుంది. ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించినా సమస్యలు తగ్గుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులు లవంగాలను ఎక్కువగా తీసుకోవాలి. మూడు పూటలా భోజనం చేయగానే ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని బాగా నమిలి ఆ రసాన్ని మింగేయాలి. దీంతో రక్తంలోని చక్కెర స్థాయిలు వెంటనే అదుపులోకి వచ్చేస్తాయి. ఇలా ప్రతి రోజూ చేస్తే మధుమేహం అదుపులో ఉంటుంది. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇన్ఫెక్షన్లు రావు. వైరల్ జ్వరాల నుంచి రక్షణ లభిస్తుంది. ఒక గ్లాస్ పాలలో పావు స్పూన్ లవంగాల పొడి, సైందవ లవణం కలిపి తాగితే తలనొప్పి వెంటనే తగ్గుతుంది. అతి దాహం సమస్యతో బాధపడేవారు లవంగాలను నోట్లో వేసుకుని నమిలితే సమస్య తీరుతుంది. లవంగాలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. లవంగాలు కండరాలు, కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. లవంగాలను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో కాపడం పెడితే నొప్పులు తగ్గుతాయి. దురదలు, గాయాలు, పుండ్లు అయిన చోట లవంగాలు, గంధం పొడిలను కలిపి పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే వెంటనే అవి తగ్గుతాయి.
Read Also..
Read Also..
చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు వెల్లడించింది. చంద్రుడి కక్ష్య నుంచి భూకక్ష్యలోకి తీసుకొచ్చామని, అరుదైన ఈ ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది. ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్-ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో ప్రకటన చేసింది. కాగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది జులై 14న ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగాన్ని చేయగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యింది. అనంతరం ప్రజ్ఞాన్ రోవర్‌పై తిరుగాడుతూ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలు చేపట్టింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సమాచారాన్నిఅందించింది. 14 రోజుల తర్వాత స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లింది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగించినా ఫలితం దక్కలేదు.
వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలంలో అకాల వర్షాల వల్ల రైతులు పండించిన పంటలు నేలకొరిగాయి. రైతులందరూ భయపడిపోతున్నారు. పూర్తిగా చేతికి అంది వచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే అల్లాడిపోతున్నారు. డెల్టా ప్రాంతం వేమూరు నియోజకవర్గంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్నారు. గవర్నమెంట్ వారి లెక్కల ప్రకారం దాదాపుగా 94 వేల ఎకరాలు వరి పంట సాగు అవుతుంది. ఈరోజు వచ్చిన ఈ తుఫాను వల్ల తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వరి కోత అనేది మొత్తం మీద ఒక 20% జరిగింది. దాదాపుగా కోత కోయకుండా ఉన్న పొలాలన్నీ కూడా ఈ వర్షానికి కింద పడిపోతున్నాయి. ఈ విధంగా కింద పడిపోతే మొలకలు ఎత్తడం. రంగు మారడం జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు.
వరంగల్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భూపాలపల్లి, జయశంకర్, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా వరి, పత్తి పంటలకు నష్టం చేకూరనుంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
తెలంగాణలో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని హాజరైన వారు ఆ కార్యక్రమం వాయిదా పడటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి సీఎం కావాలని డిమాండ్ చేస్తున్న వివిధ ప్రాంతాల నేతలు, కార్యకర్తలతో మా ప్రతినిధి సత్తిరాజు మరింత సమాచారం అందిస్తారు.
మన శరీరంలో కిడ్నీలు ఎంత ముఖ్యపాత్ర పోషిస్తాయో అందరికీ తెలిసిందే. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వాటిల్లో ఉండే మలినాలను తొలగిస్తాయి. శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతాయి. మూత్రం రూపంలో వ్యర్థాలను తొలగిస్తాయి. అవి సరిగ్గా పనిచేస్తేనే మిగిలిన భాగాలూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఇటీవల రకరకాల కారణాలతో చాలమంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ తమ మూత్రపిండాల పట్ల జాగ్రత్త వహించాలి. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మరి కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. మూత్రంలో దుర్వాసన వచ్చేవారు ఇంకా ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. ఉదయాన్నే నిమ్మరసం తాగడం కూడా మంచిదే. నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలగా బయటకి తీస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా ఉండాలి. ద్రాక్ష, నారింజ, ఆపిల్, అరటి పండ్లు, కివీ, అప్రికాట్, గుమ్మడి గింజలు తదితరాల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. కూడా కిడ్నీ వ్యాధులు ఒక పుచ్చకాయలో 91% వరకూ నీరే ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. దోసకాయలో 96% వరకు నీరు ఉంటుంది. నిత్యం తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, క్యారట్, గ్రీన్ ఆపిల్, దోసకాయ కలిపి తయారుచేసే జ్యూస్‌ను ఉదయం లేవగానే సేవించడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. టీ, కాఫీ లాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల పనితనంపై ప్రభావం చూపుతాయి. నిత్యం బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు కూడా పోతాయి. పాలు, పెరుగు, పలు రకాల బెర్రీ పండ్లు కూడా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లి, వెల్లుల్లి తప్పనిసరిగా తీసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యానికి కాలీఫ్లవర్, ముల్లంగి ఎంతో మేలు చేస్తాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు కిడ్నీల పనితీరుని పెంపొందిస్తాయి. నిత్యం మద్యం తీసుకునేవారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మద్యం తాగడం మానేయాల్సిందే.
మీచాంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మీచాంగ్ తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలూ పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాని జారీ చేశారు. మరో వైపు రేణిగుంట విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు చశారు. తిరుపతి నుంచి వెళ్లే పలు రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది. వర్ష తీవ్రత పెరుగుతుండడంతో గోగర్భం డాం గేట్లను ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు రావద్దు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Also..
Read Also..