Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Health కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఇలా చేయండి..!

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఇలా చేయండి..!

by Satya
kidneys healthy

మన శరీరంలో కిడ్నీలు ఎంత ముఖ్యపాత్ర పోషిస్తాయో అందరికీ తెలిసిందే. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వాటిల్లో ఉండే మలినాలను తొలగిస్తాయి. శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతాయి. మూత్రం రూపంలో వ్యర్థాలను తొలగిస్తాయి. అవి సరిగ్గా పనిచేస్తేనే మిగిలిన భాగాలూ ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఇటీవల రకరకాల కారణాలతో చాలమంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ మూత్ర‌పిండాల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మరి కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. మూత్రంలో దుర్వాసన వచ్చేవారు ఇంకా ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి. ఉదయాన్నే నిమ్మరసం తాగడం కూడా మంచిదే. నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలగా బయటకి తీస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగంగా ఉండాలి. ద్రాక్ష‌, నారింజ‌, ఆపిల్, అర‌టి పండ్లు, కివీ, అప్రికాట్, గుమ్మడి గింజలు త‌దిత‌రాల్లో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది. ఇవి మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి. కూడా కిడ్నీ వ్యాధులు ఒక పుచ్చకాయలో 91% వరకూ నీరే ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. దోసకాయలో 96% వరకు నీరు ఉంటుంది. నిత్యం తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, క్యారట్, గ్రీన్ ఆపిల్, దోసకాయ కలిపి తయారుచేసే జ్యూస్‌ను ఉదయం లేవగానే సేవించడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. టీ, కాఫీ లాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల పనిత‌నంపై ప్ర‌భావం చూపుతాయి. నిత్యం బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. కిడ్నీలో రాళ్లు కూడా పోతాయి. పాలు, పెరుగు, ప‌లు ర‌కాల బెర్రీ పండ్లు కూడా కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లి, వెల్లుల్లి తప్పనిసరిగా తీసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యానికి కాలీఫ్లవర్‌, ముల్లంగి ఎంతో మేలు చేస్తాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు కిడ్నీల పనితీరుని పెంపొందిస్తాయి. నిత్యం మద్యం తీసుకునేవారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మ‌ద్యం తాగ‌డం మానేయాల్సిందే.

Advertisements

You may also like

Our Visitor

014092
Total views : 78955

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.