2024 ఎన్నికలకు ఎంతో సమయం లేదని కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. పొత్తుల విషయం పక్కన పెట్టి బలంగా పని చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామానికి బీజేపీ నాయకులు వెళ్లి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలన్నారు. మన సిద్ధాంతాలు ఎప్పుడు మండల స్థాయి, బూత్ స్థాయి పోరాటాలేనని తెలిపారు. రాష్ట్రంలోని అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కేంద్రం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటుందని అన్నారు. కేంద్రం చేపట్టిన పనులు ప్రజలకు తెలియజెప్పేందుకే ఛలో అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు.
Tag:
Daggubati Purandeshwari
తెలంగాణలో మార్పు అవసరమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆమె కూకట్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబందు స్కీమ్‌లో అవినీతి జరుగుతోందని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా అంగీకరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తమ మిత్రపక్ష జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రేమ్ కుమార్‌ని గెలిపించాక నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి కూడా మద్దతు ఉంటుందని వెల్లడించారు.లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్లలో చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రభుత్వం నాలుగు కోట్ల ఇళ్లను మంజూరు చేసి, మూడు కోట్ల ఇళ్లు నిర్మించిందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో కేంద్రం ఇచ్చిన డబ్బులు ఉన్నాయన్నారు.





Total views : 79783