తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. చాలా తక్కువ సమయంలో ఫలితాలను విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే దసరా పండుగలోపు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు అందజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 62 పోస్టుల భర్తీకి మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 2 లక్షల 45 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్.బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంలోనే లోపాలున్నాయని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పేర్కొన్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టెస్టింగ్, రీహాబిలిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను…
- కోహ్లీ, శ్రేయస్ పోరాటం వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి.ఇంగ్లండ్ అద్భుతంగా పుంజుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ విజయానికి పునాది వారి పేస్ బౌలర్లు వేశారు. ముందుగా భారత జట్టును కేవలం 233 పరుగులకే ఆలౌట్ చేశారు.…
- నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి,…
- అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు సంచలన తీర్పు.అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై నమోదైన కేసులను పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని న్యాయస్థానం తన…
- పీపీపీతోనే వేగంగా అభివృద్ధి.. ‘వీజీఎఫ్ విప్లవం ఖాయం.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానమే కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పీపీపీ ప్రాజెక్టులు, ప్రభుత్వ వ్యయంపై అధికారులతో సమీక్షించిన సీఎం… త్వరలోనే ‘ఏపీ పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0’ను తీసుకురావాలని ఆదేశించారు. ఏపీ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Total views : 212473