తిరుపతి (Tirupati) మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (Ex MLA Sugunamma) తిరుగుబావుటా ఎగురవేశారు. గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ ఇన్చార్జిగా ఉంటూ ప్రజల మధ్యలోనే ఉండి వారి సమస్యలను తెలుసుకొని వారికి, పార్టీకి అండగా ఉన్నానని.. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో భాగంగా తిరుపతి సీటు జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వద్దంటు సుగుణమ్మ అధిష్టానాన్ని కోరనున్నారు. కూటమిలో భాగంగా తిరుపతిలోని జనసేన టీడీపీ లో అభ్యర్థులకు ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా ఆ అభ్యర్థిని గెలిపించి చంద్రబాబునాయుడు కి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు. తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ జనసేన సీటు తనకి ఇస్తే ఆ పార్టీలో చేరుతానని ప్రకటన చేసారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నేతలతో తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో సుగుణమ్మ సమావేశం అయ్యారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: చంద్రబాబు బెయిల్ రద్దు.. పిటిషన్పై విచారణ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 78801