రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం..పంచాంగ శ్రవణం అనంతరం ప్రసంగించారు. ఉగాది ప్రధానంగా రైతుల పండుగ అని.. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయన్న ముఖ్యమంత్రి..రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేశామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18వేల కోట్ల రూపాయలిచ్చామని..ఈనెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా ప్రారంభమవుతుందని తెలిపారు.
#farmers
ప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలు ఉన్నాయా అని మంత్రి రైతులను అడిగి తెలుసుకున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు లేవని.. వడ్లు కొనుగోలు చేసిన 24 గంటల లోపే ధాన్యం డబ్బులు పడుతున్నాయని రైతులు మంత్రికి వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం…
- ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కేబినెట్ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి.టు లారెల్ జూనియర్‌తో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో భారీగా వరి ఉత్పత్తి…
- హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ IREC-2026 హైదరాబాద్‌లో జరగనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ…
- వైసీపీకి గుడ్‌బై చెప్పిన చిన్న శ్రీను.ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం వైసీపీకి రాజీనామా చేసిన చిన్న శ్రీను..…
- స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని.. సూత్రధారులు వేరని, సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు. దళిత వర్గాల నుంచి వచ్చి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి