వికారాబాద్ జిల్లా తాండూరులో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ (Konda Visveswar Reddy) కి మద్దతుగా గోషామాల్ ఎమ్మెల్యే ప్రచారం చేశారు. చేవెళ్ల పార్లమెంటు కొండ విశ్వేశ్వర్ ని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ప్రజలకు కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసంచేశారని తీవ్రస్థాయిలో రాజాసింగ్ మండిపడ్డారు. ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డికి మోడీ ఆశీర్వాదం ఉందన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బిజెపికి ఓటు వేసి హిందువుల బలం చూపాలన్నారు. మోడీ భారతదేశం కోసం ఎంతో కష్టపడుతున్నారని మరోసారి మోడీ పీఎం కావడం ఖాయమన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాంగ్రెస్ పార్టీ వస్తే లవ్ జిహాద్ పెరుగుతుందని ఇప్పటికైనా అందరూ ఆలోచించి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఆశీర్వాదంతో తాండూరు నియోజకవర్గ సమస్యలపై పోరాడి అభివృద్ధి చేసుకుందామన్నారు. యువకులు బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…






Total views : 194482