తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భాగంగా మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని అంబిటస్ స్కూల్ 114వ పోలింగ్ స్టేషన్లో మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి తన్నీరు హరీష్ రావు బీపీ చెక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చంద్దంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంత మందకొడిగా ఉన్న గతంకంటే మెరుగ్గా ఉందన్నారు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుందో ఆలోచించి, ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొంత మంది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్దంగా పరిధి దాటి మాట్లాడుతున్నారని, వారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. నాగార్జున సాగర్ విషయంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మాట్లాడుతా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ప్రభుత్వం, కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు.
harish rao
తెలంగాణలో పార్టీ ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్ షో లతో హడావుడి చేశారు. ఇక ఓటర్ పై భారం వేశారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, బీజేపీ తరఫున మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు, కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈనెల 30న ఉదయం 7 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో జిల్లాలో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 9,66,439 మంది ఓటర్లు ఉన్నారు. 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, కొత్తగూడెంలో సీపీఐ పోటీలో ఉంది. బీజేపీ, జనసేన కూటమి నేపథ్యంలో బీజేపీ మూడు స్థానాల్లో, జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. అయితే, అంతకంటే ముందుగానే జనం నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి.
Read Also..
Read Also..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో హేమా హేమీలిలు ఈ నియోజకవర్గం నుండి గెలుపొంది ఉన్నత పదవులను అలంకరించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మదన్ మోహన్, ప్రస్తుతం ముఖ్యమంత్రి తెరాస అధినేత కేసిఆర్ ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహించినారు. 2004 లో మొదటిసారి ఎమ్మెల్యేగా తన్నీరు హరీష్ రావు రాజకీయ అరంగ్రేటం చేసి విజయం సాధించారు. అప్పటి నుండి ఎమ్మెల్యే గా హరీష్ రావు అంచెలంచెలుగా తన మెజారిటీ తనే బ్రేక్ చేస్తూ విజయం సాధిస్తున్నారు. 2019 ఎన్నికల్లో లక్ష పద్దెనిమిది వేల పై చిలుక మెజారిటీతో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ దక్కకుండా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం హరీష్ రావుకు మరో మారు పట్టం కట్టి భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన 9 సంవత్సరాల కాలంలో సిద్దిపేట అభివృద్ధి ఆకాశానికి అంటే విధంగా జరిగింది. నియోజకవర్గం లో రంగనాయక సాగర్ ద్వారా వ్యవసానికి కాల్వల ద్వారా సాగునీటిని అందించడం, మెడికల్ కాలేజ్, సిద్దిపేటకు రైలు తేవడం తో పాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయి. జిల్లా ఏర్పాటుతోనే సిద్దిపేట ఎంతో మార్పు చెంది రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన పట్టణముగా రికార్డ్ కు ఎక్కింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు మంత్రి హరీష్ రావు, కేటీఆర్ లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహిస్తూ తమ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నారు.సిద్దిపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలు, సిద్దిపేట మున్సిపాలిటీలలో అధికార బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఉండడం, బిఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ మరోవైపు గ్రామ గ్రామాన హరీష్ రావుకు కార్యకర్తల బలం అదనం అసెంబ్లీ ఎన్నికల నగార మోగిన నాటి నుండి నేటి వరకు మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహిస్తుండగా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం ఇంతవరకు ప్రచారం నిర్వహించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించడం జరుగుతున్న సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్, బిజెపి,బిఎస్ పి పార్టీల అభ్యర్థులు ఉన్నా టిఆర్ఎస్ పార్టీకి పోటీ కాదని విశ్వాసంతో నాయకులు పనిచేస్తున్నారు. హరీష్ రావు చేసిన అభివృద్ధి పనులు, కార్యకర్తల బలంతో ఈసారి కూడా సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకు భారీ మెజారిటీతో గెలుపొందేందుకు నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు..
Read Also…
Read Also…
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కేసిఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని మంత్రి హరీష్ రావు సతిమని శ్రీనిత పిలుపునిచ్చారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అంచలంచలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తాయని ఆమె తెలిపారు. సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు కు మద్దతుగా పలు వార్డులలో హరీష్ రావు సతీమణి తిరిగి ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రచార సందర్భంగా పట్టణంలో హరీష్ రావు సతీమణికి భారీ స్పందన లభించింది.
లీడర్లను కొనవచ్చు కానీ తమ ప్రజల ఆత్మ గౌరవాన్ని కొనలేరని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ… రాహుల్, ప్రియాంకలు కర్ణాటకలో అయిదు హామీలు చెప్పారని అక్కడి ప్రజలు నమ్మి ఓటేశారన్నారు. వారు అధికారంలోకి వచ్చాక ఉన్న కరెంటు పోయిందన్నారు. వారి పరిస్థితి పెనం మీది నుండి పోయిల పడ్డట్టు అయ్యిందన్నారు. వైఎస్ పీరియడ్‌లో ఉచిత కరెంటు అని ఉత్త కరెంటు చేసిండ్రని వ్యాఖ్యలు చేశారు. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా అంటూ ప్రశ్నించారు. కరెంటు కావాలంటే కారుకు ఓటు వేయండన్నారు. కేసీఆర్ ఇంత మంచిగ చేస్తుండగా కాంగ్రెస్ వాళ్ళను నమ్మడం దేనికి రిస్క్‌ల పడటం దేనికని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారని రైతులకు తిరిగి డబ్బులు ఇచ్చింది ఒక్క కేసీఆరే అని చెప్పుకొచ్చారు. తమ పథకాలు కాంగ్రెస్ వాళ్లు నకల్ కొట్టారు కానీ ఆఖల్ లేదన్నారు. కేసీఆర్ ఎకరాకు 16 వేల రూపాయలు ఇస్తా అంటే కాంగ్రెస్ వాళ్లు రైతుకు 15వేల రూపాయలు అంటున్నారన్నారు.
జమీయతుల్ ఉలమా హింద్ – TS మరియు AP చాప్టర్ తరువాతి ఎన్నికల్లో BRS పార్టీకి మద్దతు ప్రకటించి, BRSని బలోపేతం చేయాలని మైనారిటీలకు విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా జమియతుల్ ఉలమా హింద్-టీఎస్, ఏపీ అధ్యక్షులు ముఫ్తీ గయాసుద్దీన్, ప్రధాన కార్యదర్శి ముఫ్తీ జుబేర్‌కు మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్నాళ్లు అబద్దాలతో అదరగొట్టే ప్రయత్నం చేశారు బిజెపి నాయకులు.మోటార్లకు మీటర్ల అంశంపై నిర్మలా సీతారామన్ గారు కుండ బధ్దలు కొట్టారు.తెలంగాణ బిజెపి నాయకులు, ఓట్ల కోసం ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు.ఈటెల రాజేందర్, రఘునందన్, అరవింద్ ఓట్లు ఎలా అడుగుతారు.మోటార్లకు మీటర్లు పెట్టను అని కరాఖండిగా అసెంబ్లీలో చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ నిర్మలా గారు బిజెపి తో పాటు కాంగ్రెస్ బండారం బయటపెట్టారు.ఈ దేశంలో అనేక రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెడిత్నన్నరు, తెలంగాణ పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదని నిర్మలా స్పష్టంగా చెప్పారు.12 రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు, మరికొన్ని దరఖాస్తు చేశాయి అన్నాయి.కేసీఆర్ ఉన్నారు కాబట్టి అది ఇక్కడ సాధ్యం కాలేదు.రైతుల పక్షాన నిలబడ్డది ఒక్క కేసీఆర్ మాత్రమే.కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మీటర్లు పెట్టేందుకు అంగీకరించాయి.తప్పిపోయి తెలంగాణలో గెలిస్తే ఇక్కడ కూడా మీటర్లు పెడతారు.5 గంటల కరెంట్ అని శివకుమార్ బట్టబయలు చేశారు.కాంగ్రెస్, బిజెపి రెండు రైతుల పాలిత శత్రువులు.యూపీఏ వేసిన స్వామినాథన్ కమిటీని ఆ పార్టీ తుంగలో తొక్కింది.మోడీ గెలవగనే అమలు చేస్తాం అని చెప్పి మోసం చేశారు.స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు కోసం కాంగ్రెస్ ఏనాడైనా పోరాటం చేసిందా.రెండు పార్టీలు రైతులను దగా చేశాయి.బిజెపి పాలిత యుపి, అస్సాం, మణిపూర్ లో మీటర్లు పెట్టారు.ఇండియా కూటమి తమిళనాడు, బెంగాల్, కేరళ లో పెట్టారు.బిజెపి కాంగ్రెస్ సంబంధం లేకుండా ఎపీ, మేఘాలయ వంటివి మీటర్లు పెట్టాయి.దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టానని అసెంబ్లీలో ప్రకటించిన ఏకైక రాష్ట్రం, ఏకైక సీఎం కేసీఆర్ 69 లక్షల రైతుల ప్రాణాలు ముఖ్యం, 25 వేల కోట్లు మా ప్రభుత్వానికి ముఖ్యం.చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా..కాంగ్రెస్ కు ఓటు వేస్తే బాయిల కాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరించినట్లే.బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే మీటర్లు పెట్టారు.సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా.. ఎవరు వస్తరో రండి చర్చకు సవాల్.రైతును నిలబెట్టింది కేసీఆర్, మనం ఇప్పుడు కేసీఆర్ ను నిలబెట్టాలి.అప్పుల గురించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెప్పడం నిజంగా సిగ్గుచేటు.
కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ కు తెలంగాణ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వం అనే విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో ఆమె స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు నిధులు ఆపేశామని కేంద్రమంత్రి స్పష్టంగా చెప్పారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమని ఒక్క కేసీఆర్ మాత్రమే చెప్పారని గుర్తు చేశారు. 60 లక్షల మంది రైతుల ప్రయోజనాలు ఆలోచించే కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతుల కోసం రూ.25వేల కోట్లు వదులుకోవటానికి కేసీఆర్ సిద్ధపడ్డారని తెలిపారు. రిజర్వ్‌బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉందన్నారు. అలాంటిది ఓట్ల సమయంలో నిర్మలా సీతారామన్ వచ్చి తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు.
కాంగ్రెస్‌కు అధికారమిచ్చి కర్ణాటక ప్రజల్లా తెలంగాణ ప్రజలు ఆగం కావొద్దని మంత్రి హరీశ్‌రావు కోరారు. హుస్నాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావుమాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీలు ఏమో కానీ ఆరు నెలలకో ముఖ్యమంత్రి పక్కాగా మారతారన్నారు. మూడు గంటల కరెంట్‌తోనే మూడు ఎకరాలు పారుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంటున్నారని.. రైతుబంధు ఖర్చు దుబారా అని ఉత్తమ్‌కుమారెడ్డి చెబుతున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి ఓటేస్తే మోసపోవడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే BRS మేనిఫెస్టో వందరెట్లు నయమని, పింఛను, గ్యాస్ సిలిండర్, రైతుబంధు.. ఇలా BRS ఇస్తున్న వాటినే పేర్లు మార్చి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారన్నారు. వంద అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో ఉపన్యాసాలతో ఊదరగొట్టారని.. అధికారంలోకి వచ్చిన తరువాత అటు చూడటమే మానేశారన్నరు. వారు ఇక్కడ కూడా మళ్లీ ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తున్నారు.
రాష్టంలో సీఎం కేసీఆర్ ను మ్యాచ్ చేసే లీడర్ లేడని, దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎం గా కేసీఆర్ రికార్డ్ కొట్టబోతున్నారన్నారు హరీష్ రావ్. మంత్రి హరీశ్ రావు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ విద్య అంటే చాలా మంది స్కూళ్లు, విద్యా శాఖ బడ్జెట్ మాత్రమే చూస్తారు కానీ.. వైద్య శాఖ ద్వారా మెడికల్ కాలేజీలు, ఫారెస్ట్ యూనివర్సిటీ, హర్టికల్ యూనివర్సిటీ, ఫిషరీస్ యూనివర్సిటీ వంటివి కూడా విద్య కు చేసే ఖర్చుగా చూడాలి అన్నారు. వైద్య రంగాన్ని బలోపేతం చేశామని, అన్నిస్థాయిల దవాఖానాల్లో సదుపాయాలు కల్పించామన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చామని, మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య,విద్యా రంగాలను మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని భావిస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావ్.
Read Also..