అమెరికా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్‌లో ఏప్రిల్ 13న జరగబోతున్న సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై చర్చ జరుగనున్నది. ఈ అంశంపై ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ, పారిశ్రామికశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన పాలసీలు, అవి సాధించిన విజయాలను సదస్సులో వివరించి స్ఫూర్తి నింపాలని కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ లేఖలో కోరారు.
Illinois
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఇల్లినాయ్ రాష్ట్రంలోని షికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఏడుగురి ప్రాణాలు తీశాడు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు. దుండగుడి కోసం వేట కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలో జోలియట్‌లోని వెస్ట్ ఎకర్స్ రోడ్లో ఉన్న 2200 బ్లాక్‌లో ఈ కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని రోమియో నాన్స్ గా గుర్తించామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వివరించారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని, మొత్తం ఏడుగురు మృత్యువాతపడ్డారని జోలియట్ పోలీసులు వెల్లడించారు.
నిందితుడు నాన్స్ కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తాడని తెలిపారు. ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో పరారైనట్టు భావిస్తున్నామని, అతడి వద్ద ఆయుధం ఉందని, అతడిని ప్రమాదకరంగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తం చేసింది. నాన్స్‌కు సంబంధించిన సమాచారం, అతడి జాడకు సంబంధించి ఏమైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కాగా అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. గణనీయ సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే 875 తుపాకీ కాల్పుల మరణాలు నమోదయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.




Total views : 78986