తిరుపతి, టిటిడి కేటాయిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను వ్యతిరేకిస్తున్న విపక్షాలు. పట్టా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. మహతి ఆడిటోరియం లో పట్టా పంపిణీ కార్యక్రమంలో భారీ పోలీసు బందోబస్తు. తిరుపతిలో టిడిపి, జనసేన, సిపిఎం నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. టిటిడి ఉద్యోగస్తులకు పట్టాల పంపిణీని స్వాగతిస్తున్నాం అని, కానీ పట్టాలపై ఓపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకులు వూకా విజయ కుమార్. టిడిపి నాయకులను జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఇంటి పట్టాలపై వేసిన ఫోటోలు రేపు సేవా టికెట్లపై అలాగే టిటిడి సంబంధించిన వెబ్సైట్లో కూడా జగన్ ఫోటో పెడతారా అంటూ టిటిడిఈఓ ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ద్వారా గాని టీటీడీ నిధులు తో గాని ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. టిటిడి ఉద్యోగస్తులు వారి సొంత డబ్బుతో కొనుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కరుణాకర్ రెడ్డి తన కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని,ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులతో హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.
international news
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ముందుకొచ్చింది. కుప్పం అసెంబ్లీ స్తానంలో ఒక మహిళ కూడా ఎమ్మెల్యేగా స్థానం కల్పింలేదు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నానని నీలిమ స్పష్టం చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నిస్తోంది. అసలు 14 ఏళ్ల సీఎం గా, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని ప్రశ్నిస్తోంది. ఇక గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని భరత్ కు నీలిమ సవాల్ విసిరింది. కుప్పం ప్రజలు, మహిళలు ఆలోచించి, తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరిన నీలిమ. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని నీలిమ కోరారు.
తిరుపతి, టిటిడి ఉద్యోగుస్తుల 3 దశాబ్దాల ఇంటి స్థలాల కల సాకారం. నేడు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి చేతులు మీదుగా ఇంటి స్థలాల పంపిణీ. చిత్తూరు జిల్లా వడమాల పెట వద్ద 400 ఎకరాల్లో స్థలం కేటాయింపు. అర్హులైన వారందరికీ 50 అంకణాల స్థలం కేటాయింపు. దాదాపు 3 వేల మంది ఉద్యోగస్తులను అర్హులుగా గుర్తించిన టిటిడి. త్వరలోనే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు కేటాయించేందుకు టిటిడి చర్యలు.
అనారోగ్య కారణాలతో చెన్నైలోని సత్యనగర్ లో ఉన్న మియోట్ ఆస్పత్రిలో చేరిన డీఎండికే అధినేత విజయకాంత్ తుదిశ్వాస విడిచినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆయన గత నెల రోజుల క్రితం శ్వాస సంబంధిత వ్యాధితో పాటు, కిడ్నీ, లివర్లలో ఇన్ఫెక్షన్ చేరడంతో ఆస్పత్రిలో చేరారు. పది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం విజయ్ కాంత్ కు కరోనాసోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మియేట్ ఆసుపత్రిలో ఆయన చేర్చగా ఈరోజు చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మృతి చెందారు. వడపళణిలోని తన నివాసానికి మరికాసేపట్లో పార్తివదేహాన్ని తరలించనున్నారు. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున విజయకాంత్ అభిమానులు, డిఎండికె పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. విజయ్ కాంత్ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది.
అక్రమంగా గోవధకు తరలిస్తున్న 40 పశువులను మదనపల్లి గో సంరక్షణ సమితి, బిజెపి, ఆర్ఎస్ఎస్, విహెచ్పి నేతలు బుధవారం సాయంత్రం అడ్డుకుని పట్టుకున్నారు. పట్టుబడిన పశువులను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. గో సంరక్షణ సమితి పశువులను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నా మరోవైపు వదిలిపెట్టేస్తున్నారని పోలీసుల తీరిపై వారు మండిపడ్డారు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు తమిళనాడులోని గోవధశాలకు పశువులను అక్రమంగా తరలించే నిందితులపై కఠినమైన కేసులు నమోదు చేసి అరెస్టు అనంతరం, వాహనాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
పుంగనూరు, బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్. ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులు పెద్దపంజాని(మం)భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు. స్కూల్ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అని పోలీసులు వెల్లడించారు.
కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అపూర్వ స్వాగతం ఏర్పాట్లు. ఇవాళ బెంగుళూరు సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న చంద్రబాబు కోసం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు. చిత్తూరు టిడిపి నాయకుడు జి.జే.ఎమ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఫ్లేక్సిలు,స్వాగత తోరణాలు ఏర్పాటు. రోడ్డుకి ఇరు వైపులా భారీ ప్లెక్కీలు,స్వాగత తోరణాలు ఎర్పాటు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అరేబియా సముద్రంలో 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్‌లోని పోరుబందర్ పోర్టుకు 217 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన ఈ దాడిలో నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, దాడికి గురైన షిప్ దిశగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ‘ఐసీజీఎస్ విక్రమ్’ బయలుదేరిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. సముద్ర గస్తీ విమానం ‘డోర్నియర్’ రంగంలోకి దిగి దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో నౌకతో కమ్యూనికేషన్‌ను అనుసంధానించిందని తెలిపారు. దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో మర్చంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఓ పోర్ట్ నుంచి క్రూడాయిల్‌తో మంగళూరుకు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ‘ఐసీజీఎస్ విక్రమ్’ దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో దిశగా కదిలి వెళ్తోందని అధికారులు వివరించారు. దాడికి గురైన నౌక సహాయం అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలన్నింటికీ సమాచారం అందించినట్టు వివరించారు. అయితే ఎంవీ ఫ్లూటో నౌక 11 నాటికల్ మైళ్ల వేగంతో కదలుతోందని వెల్లడించారు. కాగా నౌకల ట్రాకింగ్ కోసం ఉపయోగించే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను స్విచ్ ఆఫ్ చేశారని అధికారులు తెలిపారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఆదిత్య ఎల్1 మిషన్ జనవరి 6న సూర్యుడికి దగ్గరగా ఉండే ఎల్1 పాయింట్లోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు అంచనా వేశామని, ఖచ్చితమైన సమయాన్ని నిర్ధిష్ట సమయంలో ప్రకటిస్తామని చెప్పారు. గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆదిత్య ఎల్1 మిషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.




Total views : 90077