నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు రైస్ మిల్లుల పై వరుసగా రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా సాగర్ రోడ్డు, ఖమ్మం రోడ్డులలో గల పలు రైస్ మిల్లులలో అధికారుల తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొత్తం మీద ఆరు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు ఐదు రైస్ మిల్లులో ఏకకాలంలో దాడులు జరిపారు. ఆయా రైస్ మిల్లుల్లో ధాన్యం కొనుగోలు అమ్మకాలకు సంబంధించి పలు రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Tag:
IT rides
విజయవాడలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. బందరు రోడ్డులోని ఆంజనేయ జువెల్లర్స్ లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. కేంద్ర బలగాల భద్రత నడుమ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంగారo అక్రమ రవాణా, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానిస్తూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి జువెల్లర్స్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also..






Total views : 78273