రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఓ.డి చెరువు విద్యుత్ సబ్-స్టేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం అని జగన్ ప్రభుత్వం రైతుల క్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల ఉరి తాళ్ళు, బిగిస్తున్నారని పల్లె ధ్వజమెత్తారు. ప్రస్తుత రబీ సీజన్లో బోరు బావులు కింద పంటలు సాగుచేసిన రైతులకు విద్యుత్తు కోతల కారణంగా సక్రమంగా నీరు సరఫరా కావడం లేదన్నారు. ప్రస్తుతం బోరు బావులు కింద వేరుశెనగ, మొక్కజొన్న, టమోటా, మామిడి, జామ తోటలు వంటి పంటలు నీరందక పూర్తిగా ఎండిపోతున్నాయన్నారు పంటలు చేతికందే సమయంలో రైతులకు కనీసం పెట్టుబడి సైతం చేదికే అందే పరిస్థితులు కనబడలేదు అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ట్రాన్స్కో ఏ.ఈ, కు వినతిపత్రం పల్లె సమర్పించారు.
Jagan government
ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కారు విడుదల చేసిన జీవోపై అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు, న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేంత వరకూ సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు చేస్తున్న సమ్మె శనివారానికి 26 రోజులకు చేరుకుంది. జీతాల పెంపుతో పాటు గ్రాట్యూటీ కోసం వర్కర్లు, హెల్పర్లు పట్టుబడుతున్నారు.
ఏపీ రాష్ర్ట వ్యాప్తంగా అంగన్వాడీల నిరసనలు మిన్నంటాయి. పలు చోట్ల అంగన్వాడీలు తమ నిరసనలను ఉదృతం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ.. అంగన్వాడి కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఒంటికాలతో నిలబడి నిరసనలు చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఇప్పటికైనా వైయస్ జగన్ తమ సమస్యలను తెలుసుకొని తాము పడుతున్న బాధలను, కష్టాలను గమనించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Also..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నేకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం పై బురద చల్లందుకే పని కట్టుకొని కొంతమంది ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఓ పచ్చ మీడియాలో విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం వల్ల చెడిపోతున్నారని తప్పుగా రాస్తున్నారు. ఆ ట్యాబ్ ల వల్ల అసభ్యకర వీడియోలు చూస్తున్నారని ఎల్లో మీడియా ఆరోపిస్తున్నారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ కాలంలో పిల్లలే కాకుండా ఎంపీ, ఎమ్మెల్యే లు కుడా అసభ్యకర వీడియోలు చూస్తున్నరన్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఇలా అందరికి ట్యాబులు, లాప్టాప్ లు ఇవ్వకూడదని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ స్కూలుకు దీటుగా పోటీపడేందుకు జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కేవలం చంద్రబాబు మనవడు, పవన్ కళ్యాణ్ కొడుకులు మాత్రమే పెద్ద చదువులు చదువుకోవాలనుకోవడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు.
రైతుల పాలిట జగన్ పాలన శాపంగా మారిందని, నాలుగేళ్ల జగన్ పాలనలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని పచ్చలతాటిపర్రు, మునిపల్లె, గొళ్ళముడిపాడు, వెల్లలూరు తదితర గ్రామాలలో తుఫాను నేపథ్యంలో నీట మునిగిన పంట పొలాలను మంగళవారం ఆయన టిడిపి శ్రేణులు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప రైతులకు మేలు చేసిందేమీ లేదన్నారు. గత సంవత్సరం తుఫాను సమయంలో దెబ్బతిన్న పంటలు కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. వారం రోజులుగా తుఫాన్ గురించి హెచ్చరికలు వస్తున్నప్పటికీ అధికారులను అప్రమత్తం చేయటంలో విఫలం అయ్యారని ఆరోపించారు. తుఫాను ప్రభావంతో పంట చేతికి వచ్చే సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం పెద్ద పనుస్సుతో వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు గత ఆరునెలలుగా జగన్ సర్కారు రూ.1000కోట్లరూపాయలు బకాయిలు పెట్టినందున ఈనెల 27వతేదీ నుంచి వైద్యసేవలు నిలిపివేస్తామని ఎపి స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోంది. కరోనా విపత్తు సమయంలో సాక్షాత్తు సిఎం సొంత జిల్లా కడపలో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించబడవని బోర్డులు పెట్టినపుడే జగన్ రెడ్డి పనితనమేమిటో రాష్ట్రప్రజలకు అర్థమైంది. చేతగానిపాలనతో ఖజానాను దివాలా తీయించిన ముఖ్యమంత్రి ముఖం చూసి కాంట్రాక్టర్లు పరారు కావడం చూశాం. స్కూలు పిల్లలకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి పేపర్లకు దిక్కులేక వాట్సాప్ లో ప్రశ్నాపత్రాలను పంపించిన విచిత్రమైన పరిస్థితిని కూడా చూశాం. నాలుగున్నరేళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో ట్రిపుల్ ఎ ప్లస్ గా ఉన్న రాష్ట్ర పరపతిని ట్రిపుల్ బి ప్లస్ కు దిగజార్చారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా లక్షలాది నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేసి పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.…నారా లోకేష్
Read Also..





Total views : 78212