తిరుపతి లో వైసిపి సామాజిక సాధికార యాత్రతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని.. నిన్నటి కార్యక్రమం ఎలక్షన్ కి ప్రచార అర్బాటం తప్ప ఇంకొకటి కాదని, నాలుగు సంవత్సరాలలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో, ఎంత మందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. ఎంపి మార్గాని మాటలను ఖండించారు. తిరుమలలో జగన్ మోహన్ కి భజన చేయడం మంచి పద్దతి కాదని తిరుమలలో ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా టిటిడి చర్యలు చెపట్టాలని డిమాండ్ చేశారు..
Janasena
ఇవాళ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతో నాదెండ్ల మనోహర్ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా స్థాయి సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీ చేయి కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఇటీవల ఇరు పార్టీల సమన్వయ కమిటీ తొలిసారిగా భేటీ అయింది. జిల్లా స్థాయిలోనూ సమన్వయ సమావేశాలు జరపాలని కమిటీ భేటీలో నిర్ణయించారు. అదే సమయంలో, రెండు పార్టీలు కలవకూడదన్న ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని, వారి ఉచ్చులో పడొద్దంటూ పార్టీ శ్రేణులను నాదెండ్ల అప్రమత్తం చేశారు. ఇక, పొత్తులోకి బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. జనసేన తరఫున ఆయా జిల్లాల పరిధిలోని ఇన్చార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో కలిపి 50 మంది వరకు సమన్వయ సమావేశంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు.
మద్యనిషేధం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతోందన్నారు పవన్ కళ్యాణ్. ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందన్నారు. ఆ తెగులు పోవాలంటే.. టీడీపీ – జనసేన వ్యాక్సిన్ అవసరమని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారని, సాంకేతిక అంశాల పేరుతో బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే కలిశామని చెప్పారు. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించామన్నారు. టీడీపీ -జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించామని, త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని పవన్ అన్నారు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు ఏర్పాటైన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సరికొత్త వ్యూహాలను ఖరారు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు రెండు పార్టీల కమిటీ నేతలు భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు ఖరారు చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు.




Total views : 90034