Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh జగనాసుర అంతం మొదలైంది – పవన్ కళ్యాణ్

జగనాసుర అంతం మొదలైంది – పవన్ కళ్యాణ్

by Rama
pawankalyan

మద్యనిషేధం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతోందన్నారు పవన్ కళ్యాణ్. ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందన్నారు. ఆ తెగులు పోవాలంటే.. టీడీపీ – జనసేన వ్యాక్సిన్‌ అవసరమని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారని, సాంకేతిక అంశాల పేరుతో బెయిల్‌ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే కలిశామని చెప్పారు. ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించామన్నారు. టీడీపీ -జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించామని, త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని పవన్‌ అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

040986
Total views : 212584

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: