మరో నాలుగు నెలల్లో రామకృష్ణాపూర్ క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులోకి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి..పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.మరో నాలుగు నెలల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం బ్రిడ్జి పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.అలాగే బ్రిడ్జి నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎంపీ గా ఉన్న సమయంలో రైల్వే గేటు వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని, రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి నిర్మించి దాదాపుగా పదేళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబి పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాలేదని మండిపడ్డారు. ఆర్ఓబి పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని దసరా లోపు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పనుల్లో అలసత్వం చేస్తే సహించేది లేదని అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మెన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,రఘునాథ్ రెడ్డి, పల్లే రాజు, అబ్దుల్ అజీజ్, నాయకులు ఉన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.