జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Magnesium
చలికాలంలో నచ్చిన వంటకాలు తింటూ శారీరక చురుకుదనం లోపించడంతో త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆహారంలో మార్పుల ద్వారా వింటర్లో మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో అధిక క్యాలరీలతో కూడిన పరాటాలు, పూరీలకు బదులు బరువు నియంత్రణలో ఉండేందుకు మొక్కజొన్న రోటీలను తినడం మేలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. మొక్కజొన్న రోటీలతో బరువు తగ్గడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మొక్కజొన్న గ్లూటెన్ రహితం కావడంతో గ్లూటెన్ సరిపడని వారు సైతం నిరభ్యంతరంగా దీన్ని తీసుకోవచ్చు. ఇక మొక్కజొన్న పిండిలో ప్రొటీన్, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ సహా పలు విటమిన్లు ఉండటంతో దీన్ని పోషకాల గనిగా చెబుతారు.
కలబందతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్‌లు, అమైనో ఆమ్లాలు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలను కలిగిన, పోషకాలు అధికంగా ఉండే మొక్క. కలబందలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి2 , విటమిన్ బి3, విటమిన్ బి6, విటమిన్ బి12 వంటి వివిధ విటమిన్లు ఉంటాయి. రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యం, కంటి చూపు, శక్తి ఉత్పత్తి వంటి వివిధ శారీరక విధులు నిర్వర్తించడంలో ఈ విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కలబందలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, మాంగనీస్, సెలీనియం, రాగి వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు సరైన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, ఎముకల ఆరోగ్యం, నరాల పనితీరు, అనేక ఇతర శారీరక ప్రక్రియలను నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కలబందలో విటమిన్లు సి, ఇ, బీటా కెరోటిన్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్తం చేయడంలో సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. అలోవెరాలో దాదాపు 20 రకాల అమైనో ఆమ్లాలు ఉన్నాయి. వీటిలో అవసరమైన, అనవసరమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల బిల్డింగ్ బ్లాక్‌లు, కణజాల మరమ్మత్తు, రోగనిరోధక పనితీరు, ఎంజైమ్ ఉత్పత్తితో సహా అనేక జీవ ప్రక్రియలలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. కలబందలో సపోనిన్లు, సాలిసిలిక్ యాసిడ్, ఫైటోస్టెరాల్స్, యాంటీఆక్సిడెంట్లు వంటి ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవి వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తాయి. కలబంద శతాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ఒక ఔషధ మొక్క. ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. జెల్ లాంటి పదార్థాన్ని కలిగి మందపాటి, కండగల ఆకులతో ఉంటుంది. కలబందపై విస్తృత పరిశోధనలు జరిగాయి. కలబంద అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో, ఆర్థరైటిస్ వంటి తాపజనక పరిస్థితుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలోవెరా జెల్ చర్మాన్ని నయం చేసే లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని శాంతపరచడానికి, తేమగా ఉంచడానికి, మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. గాయం నయం చేసే గుణాలు కలిగి ఉంటుంది. సన్‌బర్న్, మొటిమలు, సోరియాసిస్ వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచే, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అలోవెరా రసంలో ఆంత్రాక్వినోన్స్ ఉన్నాయి. ఇవి ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. మల విసర్జన సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి.
బాదంలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఈ, కాల్షియం, జింక్, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇవి మెదడు, కళ్లు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. బాదంలో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, కొందరు ఆరోగ్యానికి బాదం మేలు చేస్తుందని ఎక్కువగా తింటూ ఉంటారు. బాదం అతిగా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బాదం ఎక్కువగా తింటున్నారా అయితే ఇది తెలుసుకోండి. బాదం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో విటమిన్ E మోతాదులు పెరుగుతాయి. విటమిన్ E కొవ్వులో కరిగే విటమిన్. విటమిన్ ఇ ఎక్కువగా తీసుకుంటే విషంగా మారవచ్చు. దీని కారణంగా కడుపులో తిమ్మిరి, డయేరియా, జీర్ణసమస్యలు ఎదురవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. విటమిన్ ఇ స్థాయిలు ఎక్కువైతే.. రక్తం గడ్డకట్టే ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. బాదంలో ఆక్సలేట్లు ఉంటాయి. ఈ ఆక్సలేట్లు ఎక్కువగా తీసుకుంటే కీడ్నీలో రాళ్లకు కారణం అవుతాయి. దీని దృష్టిలో ఉంచుకుని బాదం, మితంగా తీసుకోవడమే మేలు. బాదంపప్పులో ఫైటిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. పైటిక్ యాసిడ్ కాల్షియం, ఇనుము, జింక్ శోషణను ప్రభావితం చేస్తుంది. జీర్ణవ్యవస్థ ఈ పోషకాలు గ్రహించకుండా అడ్డుపడుతుంది.
చూడగానే ఎర్రగా నోరూరించే పండు దానిమ్మ. వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. కేలరీలు 234, ప్రోటీన్ 4.7గ్రా, కొవ్వు 3.3 గ్రా, కార్బోహైడ్రేట్స్ 52 గ్రా, ఫైబర్ 11.3 గ్రా వీటితో పాటు విటమిన్ సి, ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియంలు ఉన్నాయి. దానిమ్మ పండ్లని ఎక్కువగా తీసుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి. దానిమ్మ రసం తీసుకుంటే ప్రొస్టేట్ క్యాన్సర్ తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ పండు తింటే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యల్ని దూరం చేస్తాయి. దానిమ్మలో ఎల్లాజిటానిన్స్ అనే యాక్సిడెంట్స్ శరీరంలోని వాపుని తగ్గిస్తాయి. దానిమ్మ పండు మూత్రపిండాల పనితీరుని మెరుగ్గా చేస్తుంది. ఇది కిడ్నీల్లో రాళ్ల సమస్యని తగ్గిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యని దూరం చేయడంలో ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది. దానిమ్మ రసం రక్తంలో ఆక్సలేట్స్, కాల్షియం సాంద్రతని తగ్గిస్తుంది. దానిమ్మలో పాలీఫెనోలిక్ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తక్కువ కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇందులో పీచు, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దానిమ్మలో దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి. దానిమ్మతో అల్జీమర్స్, పార్కిన్సన్స్ సమస్యలు దూరమవుతాయి. దానిమ్మ తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
వాల్‌నట్స్‌లో విటమిన్ B6, E, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, రాగి, సెలీనియం, ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్‌నట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాల్నట్లలోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. అల్జీమర్స్, డిమెన్షియా వచ్చే అవకాశం తగ్గిస్తాయి. ఫోలిక్ యాసిడ్ కూడా సమృద్ధిగా ఉంటుంది. రోజూ వాల్నట్స్ తింటే రక్తహీనత దూరం అవుతుంది. వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మేలు చేస్తుంది. అలాగే ప్రీబయోటిక్ కాంపౌండ్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి. వాల్‌నట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ కడుపును నిండుగా ఉంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. దీంతో తక్కువగా తింటారు. ఇది బరువును కంట్రోల్లో ఉంచుతుంది. వాల్‌నట్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. రోజూ వాల్నట్స్ తింటే ఆర్ర్థరైటిస్‌తో వచ్చే నొప్పులు, వాపులు క్రమంగా తగ్గుతాయి. వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ను పెంపొందిస్తాయి. రోజూ వాల్నట్స్ తింటే బ్రెస్ట్ క్యాన్సర్ రిక్స్ తగ్గుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి. నట్స్ అన్నింట్లో కల్లా వాల్నట్స్ బలమైన ఆహారం. వీటిని ఆక్రోట్స్ అని కూడా పిలుస్తారు. రోజుకు 4 వాల్నట్స్ నానబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
Read Also..
Read Also..
చెరకు రసంలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ తో పాటు అనేక ఇతర అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. చెరకులో సహజమైన సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. మీరు అధిక వేడితో అలసిపోయినా మీ శరీరంలో నీటి కొరత ఉన్నట్లు అనిపించినా చెరకు రసం మీకు ఉపయోగపడుతుంది. కాలేయానికి మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం చెరకు రసం కామెర్లు చికిత్సలో ఉపయోగిస్తారు. ఎందుకంటే చెరుకు రసం కాలేయాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చెరకు రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి. కాలేయంలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది ఎల్లో ఫీవర్‌ను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. నోటిలో కావిటీస్, నోటి దుర్వాసన నివారణకు చెరకు రసంలో కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఉండటం వల్ల పళ్లపై ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది. దాని ద్వారా వాటికి పురుగులు, దంతాలలో పుచ్చులు ఉండవు. చెరకు రసం కూడా నోటి దుర్వాసన సమస్యను దూరం చేస్తుంది. చెరకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు నయం చేయడంలో సహాయపడుతుంది. ప్రత్యేకంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించేవారు చెరుకు రసం తాగడం వల్ల మేలు జరుగుతుంది. అంతే కాకుండా చెరుకు రసం మూత్రపిండాల్లో రాళ్లను తగ్గిస్తుంది. చెరుకు రసంలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. దీంతో పాటు జీర్ణక్రియను మెరుగు చేయడం సహా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
Read Also..
Read Also..
రుచి అద్భుతంగా ఉండే చెరుకు రసంలో పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్, కార్బొహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు చెరుకు రసం ద్వారా పొందొచ్చు. అందుకే చెరుకు రసం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికే కాదు. చర్మ సౌందర్యానికి కూడా చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది. చర్మానికి చెరుకు రసాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం. ముఖంపై మొటిమలను తగ్గించడంలో చెరుకు రసం గ్రేట్‌గా సహాయపడుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చెరుకు రసం మరియు నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకుని.ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేస్తే. క్రమంగా మొటిమలు మటుమాయం అవుతాయి. అలాగే చర్మ కాంతిని రెట్టింపు చేయడంలోనూ చెరుకు రసం ఉపయోగపడుతుంది.ఒక బౌల్లో చెరుకు రసం మరియు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి. నెమ్మదిగా మసాజ్ చేయాలి.బాగా డ్రై అయిన తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే. ముఖం కాంతివంతంగా, అందంగా మెరుస్తుంది. ఇక చెరుకు రసాన్ని ముఖానికి డైరెక్ట్‌గా అప్లై చేసి.నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు వేళ్లతో మెల్ల మెల్లగా మసాజ్ చేసుకోవాలి.ఆ తర్వాత పావు గంట పాటు వదిలేసి. అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.చర్మంపై ముడతలు, సన్నని గీతలు పోయి ముఖం యవ్వనంగా, మృదువుగా మారుతుంది.
భారతీయులు ఎక్కువగా తినే ఆహారాల్లో వరి అన్నం తర్వాతి స్థానం చపాతీదే. బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంది చెప్పే సలహా అన్నం తినడం మానేసి చపాతీ తినమని అంటారు. మధ్యాహ్నం అన్నం, రాత్రి వేళ ఒకటీ రెండూ చపాతీ తినాలన్నది చాలా మంది సూచన. చపాతీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల ఎక్కువ సేపు కడుపు నిండి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆకలి వేయదు. అసలు బరువు తగ్గడానికి రోజూ ఎన్ని చపాతీలు తినాలి, ఎప్పుడు తినాలి, చపాతీలు ఎలా తింటే బరువు తగ్గవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. చపాతీలోని పోషక విలువలు ఒక చపాతీలో (27గ్రా) ఎన్ని పోషకాలు ఉంటాయంటే కొవ్వు – 2.5గ్రా , ఉప్పు – 80 మి.గ్రా , పొటాషియం – 53 మి.గ్రా , కొలెస్ట్రాల్ – 0 మి.గ్రా , కార్బోహైడ్రేట్లు – 12 గ్రా , ప్రోటీన్ – 2.1 గ్రా , ఫైబర్ – 2.6 గ్రా సాధారణంగా చపాతీలో(నెయ్యి లేదా నూనె కలపని) అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే అందులో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. చపాతీలో విటమిన్ బి1, బి3, బి5, బి6, బి9, విటమిన్ ఇ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా చపాతీ ద్వారా లభిస్తాయి. ఒక చిన్న చపాతీలో దాదాపు 81 కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు రోజుకు నాలుగు చపాతీలు తినాలని అంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వారు మధ్యాహ్న భోజనంలో చపాతీలు తీసుకుంటే ఇతర ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి. 50 కేలరీలకు మించకుండా చపాతీలు, కూరగాయలు, సలాడ్లు తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటున్నట్లు అనిపిస్తే చపాతీ సంఖ్యను తగ్గించుకోవాలి.
Read Also..
Read Also..
కూరగాయలు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. కూరగాయల్లో బీరకాయచాలా ముఖ్యమైంది. బీరకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో పీచు పదార్థం ఎక్కువుగా ఉండడం వల్ల వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాదు బీరకాయలో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా బరువు తగ్గడానికి కూడా ఇది మంచి ఆహారం. బీరకాయ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అంతేకాదు చాలామంది మహిళలు రక్తహీనతతో భాధపడుతుంటారు. ఈ సమస్యకు బీరకాయ చెక్ పెడుతుంది. కడుపులో మంట తో భాధపడేవారు బీరకాయ తీసుకోవడం మంచిది. బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయ ఆరోగ్యానికి సహాయ పడుతుంది. కామెర్లు వచ్చిన వారు బీరకాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అంతేకాదు బీరకాయ కళ్ళకు సంభందించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది. శరీరంలోని చేదు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బీరకాయ తరచు తింటే మీ చర్మం కూడా నిగనిగలాడడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.