లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే వారం అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. లక్షమంది ఒవైసీలు వచ్చినా మోడీని ప్రధాని కాకుండా అడ్డుకోలేరన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంపార్టీలు ఒక్కటే అని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం కోసం కాదు అసదుద్దీన్‌ను ఓడించడం కోసమే పని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Tag:
Majlis Party
నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ రిమోట్ ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కారణంగానే కేంద్రంలో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ తనను బాధ్యుడిగా చెబుతోందని, కానీ ఆ పార్టీ విజయం సాధిస్తే తాను ఎలా బాధ్యుడిని అవుతాను? అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని ఎద్దేవాచేశారు. ఎవరు ఎన్ని చెప్పినా… బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.





Total views : 78352