పల్నాడు జిల్లా.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఫ్లెక్సీలు కలకలం రేపాయి. వినుకొండ పట్టణంలో వైసీపీ నేతల ఫోటోలు లేకుండా మల్లికార్జునరావు ఫోటోలతో వెలసిన ఫ్లెక్సీలు, మీరు తీసుకునే నిర్ణయం వైపు మా ప్రయాణం అంటూ మక్కెన మల్లికార్జునరావు అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. వినుకొండలో మక్కెన మల్లికార్జునరావు అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై చర్చ మొదలైంది. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటుతో మక్కెన వైసీపీని వీడతారా.. అనే చర్చ కొనసాగుతుంది. నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో మక్కెన మల్లికార్జునరావుకు మంచి సంబంధాలు ఉన్నాయని చర్చ.
Tag:
mp lavu krishnadevarayalu
గుంటూరు ఎంపీ ఎన్నికల బరిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియామకం చేసేందుకు వైసీపీ కసరత్తు. ఎంపీ మార్పు పై ఆసక్తి చూపని నరసరావు పేట పార్లమెంట్ ఎమ్మెల్యేలు. నరసరావు పేట ఎంపీ స్థానాన్ని బిసి వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని వైసీపీ అధిష్టానం యోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. నరసరావు పేట పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. గుంటూరు పార్లమెంట్ కి వస్తే తాడికొండ, మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగ తగులుతుందని ఎంపీ ఆలోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఎలాంటి మార్పు జరుగుతుందా అని వైసీపీ కింది స్థాయి నేతల్లో ఆసక్తి నెలకొంది.





Total views : 80402