మణిపూర్‌లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానికి ఆ మిలిటెంట్ సంస్థ ముగింపు పలికింది. ఆయుధాలు అప్పగించడంతోపాటు శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతాల్లో ప్రభావితంగా ఉన్న పురాతన సాయుధ సమూహం యూఎన్ఎల్ఎఫ్ హింసను వీడి ప్రధాన స్రవంతిలో చేరడానికి అంగీకరించినట్లు చెప్పారు. పురోగతి పథంలో ప్రయాణించేందుకు ప్రజాస్వామ్యంలోకి వారిని స్వాగతిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. యూఎన్ఎల్ఎఫ్ క్యాడర్ తమ ఆయుధాలను అప్పగించిన వీడియోను కూడా షేర్ చేశారు.
National News
చైనాలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తర చైనాలో కోవిడ్ తొలిరోజుల్లో ఉన్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. చాలా స్కూళ్లలో చిన్నపిల్లల్లో నిమోనియా తరహా లక్షణాలు బయటపడుతున్నాయి. అంతేగాక ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు రీ ఏజెంట్స్ ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానిపై సమీక్షించుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఈ వసతులన్నీ సరిపడేలా ఉండేలా చూసుకోవాలని కోరింది. ఇవేగాక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్ ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. చిన్నారుల్లో తలెత్తే శ్వాస సంబంధిత వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నమోదయ్యే కేసుల డేటా ఎప్పటికప్పుడు జిల్లా, స్టేట్ సర్విలెన్స్ యూనిట్లలో అప్ లోడ్ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. డేటా కరెక్ట్ గా ఉంటే పరిస్థితిని పక్కాగా పర్యవేక్షించడానికి వీలవుతుందని తెలిపింది. కోవిడ్ మహమ్మారితో ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒకచోట బాధపడుతున్న చైనా తాజాగా నమోదవుతోన్న ఎనీమాటిక్ నిమోనియా కేసులతో బెంబేలెత్తుతోంది. స్కూలు పిల్లల్లో నమోదవుతోన్న ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఈ నుమోనియా కేసులకు ఎలాంటి కొత్త వైరస్ కారణం కాదని చైనా హెల్త్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. అయినా ఈ కేసులపై మరింత సమాచారం అందజేయాలని WHO చైనా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం.
ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 388గా నమోదు అయింది. ఢిల్లీ వాసులు కళ్ల మంట, దగ్గు, గొంతునొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. వాయు వేగం తగ్గడం కాలుష్యానికి మరో కారణం. నివారణకు ఢిల్లీ ప్రభుత్వం 15పాయింట్ల కార్యాచరణ చేపట్టనున్నారు. ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్ లో పంట వ్యర్థాల దహనంతో పొగ వ్యాపించి కాలుష్య తీవ్రత పెరుగుతోంది. ఆర్కే పురంలో 422, వాజి పూర్ లో 443, అలీ పూర్ లో 432, ఆనంద్ విహార్ లో 411 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో గాలి నాణ్యత నమోదైంది.
భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫాతిమా బీవీ వయసు 96 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశాక కేరళలోని పత్తంనతిట్టలో నివాసం ఉంటున్నారు. ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి మాత్రమే కాదు, జాతీయ మానవ హక్కుల కమిషన్ మొట్టమొదటి చైర్ పర్సన్ కూడా. అంతేకాదు, ముస్లిం వర్గం నుంచి గవర్నర్ గా నియమితురాలైన తొలి మహిళ కూడా ఆమే. జస్టిస్ ఫాతిమా బీవీ గతంలో తమిళనాడుకు గవర్నర్ గా వ్యవహరించారు.
Read Also..
Read Also..
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులు ఏ క్షణంలోనైనా బయటకు రావొచ్చని అధికార వర్గాల సమాచారం. రెస్క్యూ పనులు తుది దశకు చేరుకున్నాయని, టన్నెల్ కు సమాంతరంగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులు చివరకు వచ్చాయని అధికారులు చెప్పారు. వాస్తవానికి ఈ రోజు ఉదయమే కార్మికులను బయటకు తీసుకొస్తామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్పారు. అయితే, డ్రిల్లింగ్ పనుల చివరి దశలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయని, చివర్లో ఇనుప రాడ్లు బయటపడడంతో డ్రిల్లింగ్ పనులు నెమ్మదించాయని వివరించారు. కార్మికులను బయటకు తీసుకురాగానే వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు టన్నెల్ బయట 41 అంబులెన్స్ లను అధికారులు సిద్దం చేసి పెట్టారు. టన్నెల్ కు సమీపంలో 41 పడకలతో తాత్కాలికంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అవసరమైతే హుటాహుటిన తరలించేందుకు హెలికాఫ్టర్ ను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డ్రిల్లింగ్ పని పూర్తికాగానే స్టీల్ పైపును అమర్చి, లోపలికి వెళ్లేందుకు 15 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా టన్నెల్ లో సిద్ధంగా ఉంది. కార్మికులను ఎలా బయటకు తీసుకురావాలనే విషయంపై ఈ బృందం ఇప్పటికే పలుమార్లు మాక్ డ్రిల్ నిర్వహించి సిద్దమైంది. ఉత్తరకాశీలోని ఈ టన్నెల్ ముందువైపు కుప్పకూలడంతో ఈ నెల 12 నుంచి 41 మంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారవర్గాలు ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లు చేశాయి. లోపల ఉన్న వారికి పైపుల ద్వారా ఆక్సిజన్, ఆహార పదార్థాలు, దుస్తులు సహా అవసరమైన వాటిని పంపించారు. డ్రిల్లింగ్ కోసం భారీ మెషినరీ తెప్పించి విశ్రాంతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ లో మునిగిపోయారు. అధికారులు, రెస్క్యూ టీమ్ కృషి ఫలించి మరికాసేపట్లో కార్మికులంతా క్షేమంగా బయటపడనున్నారు.
పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తే భారతదేశ భవిష్యత్తు సమాధి అయిపోయినట్టేనని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ హెచ్చరించారు. ప్రజా జీవనంలో తానెప్పుడూ అబద్ధాలు చెప్పలేదన్నారు. అధ్యయనం చేయకుండా ఏ విషయంపైనా అవాకులు, చెవాకులు చెప్పనని స్పష్టం చేశారు. గత 75 ఏళ్లుగా ఎన్నో తప్పులు చేశామని అయితే విధానాల్లో మార్పు రావడం వల్ల, టెక్నాలజీ పెరగడం వల్ల, ప్రపంచం మనపట్ల సద్భావనతో ఉండడం వల్ల మనం ఎదిగే అవకాశం కనిపిస్తోందని అన్నారు. మనం కనుక మళ్లీ పాత పెన్షన్ విధానానికి మళ్లితే మనం ఎదిగే అవకాశాన్ని కోల్పోయినట్టేనని, అది జీవన్మరణ సమస్య అవుతుందని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. కాబట్టి హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఒకవేళ ఆలోచించకుండా హామీ ఇస్తే దానిని వెనక్కి తీసుకోవడమో, మధ్యేమార్గాన్ని అన్వేషించడమో చేయాలని సూచించారు.
రైలు ప్రయాణీకులను వేగంగా గమ్యాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రైస్ ట్రైన్లకు ప్రజల నుంచి అనుహ్య స్పందన లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం 34 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పగటిపూట నడుస్తుండగా. తొలిసారి ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళ కూడా వందే భారత్ ఈ సేవలను ప్రారంభించనుంది. సౌత్ సెంట్రల్ రైల్వే తొలిసారిగా 2023 నవంబర్ 21న ఈ ట్రైన్ సేవలను ప్రారంభించనుంది. తమిళనాడు, కర్ణాటక మధ్య సెమీ హై స్పీడ్ వందే భారత్ రైల్ ను రాత్రిపూట నడపనున్నారు. మరో వందే భారత్ స్పెషల్ ట్రైన్ యశ్వంత్ పూర్-బెంగళూరు నుండి చెన్నై సెంట్రల్ మధ్య నడవనుంది. చెన్నై సెంట్రల్ నుంచి 8 కోచ్ ల వందేభారత్ ఎక్స్ ప్రెస్ నవంబర్ 21న రాత్రి 11 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఇక ఐదున్నర గంటల్లోనే గమ్యాన్ని ఈ ఎక్స్ ప్రెస్ చేరుకుంటుంది. ప్రయాణీల నుంచి రెస్పాన్స్ ను బట్టి మరిన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించే ఆలోచన చేస్తామని అధికారులు తెలిపారు.
ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులకు తాజాగా సర్ప్రైజ్ ఇచ్చింది. ఉద్యోగులకు పనితీరు ఆధారంగా 80 శాతం వెరియబుల్ పే చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ బోనస్‌కు అందరూ అర్హులు కారని పేర్కొంది. కంపెనీ ప్రకటన ప్రకారం లెవెల్ 9 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకు సగటున 80 శాతం వేరియబుల్ పే ఇవ్వనుంది. ఈ మేరకు ఉద్యోగులకు సంస్థ ఈమెయిల్ పంపించింది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, సంస్థలో నిర్వహించిన సామార్ధ్యాన్ని బట్టి బోనాస్ వర్తిస్తుందని తెలిపింది. వారానికి 70 పనిగంటలు సూచనతో ఇటీవల సంచలనం స్పృష్టించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, కొత్తగా వ్యాపారవేత్తగా మారడం కష్టంతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. సాప్ట్వేర్ ఇంజినీర్,ఫైనాన్షియల్ ఎనలిస్ట్ కావడం సులభమే కానీ పారిశ్రామికవేత్తగా కొనసాగడం కష్టం అన్నారు. దానకి ఎంతో శ్రమ అవసరం అన్నారు. భారత్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు అన్నారు. అయితే, దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అనూకూల వాతావరణం కోసం భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది అభిప్రాయపడ్డారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖ్యాతి తార స్థాయికి చేరుకుంది. తాజాగా మరో రెండు మిషన్లకు ఇస్రో సిద్ధమవుతోంది. లూపెక్స్, చంద్రయాన్-4 మిషన్లకు రెడీ అవుతోంది. ఈ మిషన్ల ద్వారా 350 కేజీల ల్యాండర్ ను 90 డిగ్రీల ప్రాంతం (చీకటి వైపు)లో ల్యాండ్ చేయడానికి, శాంపిల్ రిటర్న్ మిషన్ ప్రయోగాల కోసం ప్రస్తుతం పని చేస్తున్నట్టు అహ్మదాబాల్ లో ఉన్న స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుడిపై దిగిన తర్వాత, సెంట్రల్ మాడ్యుల్ అక్కడి నుంచి శాంపిల్స్ ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ ను వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో చేపడతామని చెప్పారు.
Read Also..
భారతదేశం ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశానికి సంతోషకరమైన, సంపన్నమైన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా నిరుపేదలకు సహాయం చేయాలని, వారి ఆనందాన్ని అవసరమైన వారితో పంచుకోవడం ద్వారా ఆనందం, శ్రేయస్సును వ్యాప్తి చేయాలని ఆమె పౌరులను కోరారు. వివిధ మతాలు, విశ్వాసాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రేమ, సోదరభావం, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తారు. ఈ పండుగ దయ, సానుకూలత, శ్రేయస్సుకు చిహ్నం. దీపావళి పండుగ మన మనస్సాక్షిని ప్రకాశవంతం చేస్తుంది. అలాగే మానవాళి సంక్షేమం కోసం పనిచేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఒక దీపం అనేక దీపాలను వెలిగించగలదు. అదే పద్ధతిలో, పేదలు, పేదవారితో మన ఆనందాలను పంచుకోవడం ద్వారా వారి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సును తీసుకురాగలము, ” అని రాష్ట్రపతి ముర్ము చెప్పారు.
Read Also..
Read Also..