నెల్లూరు రూరల్‌లో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. దొంతాలి డంపింగ్ యార్డును మున్సిపల్ శాఖ నారాయణ పరిశీలించారు. చెత్త నిర్వహణ పనులు, వ్యర్థాల శుద్ధి ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.జూలై నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగిస్తామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన చెత్త రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.గత ప్రభుత్వం చెత్త నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రజలపై చెత్త పన్ను విధించిందని విమర్శించారు.
ప్రస్తుతం గుంటూరు, విశాఖపట్నంలోని వెస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లలో ప్రతిరోజూ సుమారు 2,800 టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.2014లో మంజూరైన వెస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను గత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని, విజన్ లేకపోవడంతో ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ఆరు వెస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, వాటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు.
Tag:




Total views : 212149