బాసరలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రోజుకో అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రుల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలను కనులారా వీక్షించడానికి దేశ నలుమూల నుంచి వేలాది భక్తులు హాజరు కానున్నారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉండడంతో తొమ్మిది రోజుల పాటు ముగ్గురు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు.
నవరాత్రి ఉత్సవాలలో అమ్మవార్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వడం సంప్రదాయం. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిని, మూడవ రోజు చంద్రగంట, నాల్గవ రోజు కుష్మాండ అవతారం, ఐదవ రోజు స్కంద మాత, ఆరవ రోజు కాత్యాయని అవతారం, ఏడవ రోజు కాలరాత్రి అలంకారం, ఎనిమిదవ రోజు మహా గౌరీ, తొమ్మిదవ రోజు సిద్ధ ధాత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవార్లకు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాన్ని… ఆలయ అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి సమర్పిస్తారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 195925