Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Telangana శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వైపు పరుగులు పెడుతున్న గోదావరి

శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వైపు పరుగులు పెడుతున్న గోదావరి

by Rama
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వైపు పరుగులు పెడుతున్న గోదావరి

నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది ఎగువ ప్రాంతం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో అధికారులు ఓపెన్ చేశారు. దీంతో బాసర శ్రీజ్ఞాన సరస్వతి క్షేత్రం సమీపంలో గల గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈరోజు వరకు అడుగంటుకు పోయిన గోదావరి జలాలు నూతనంగా బాబ్లీ వైపు నుండి బాసర గోదావరి మీదుగా వరద జలాలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ప్రవహిస్తూ పరవాళ్లు తొక్కుతున్నాయి. నిన్న బాబ్లీ ప్రాజెక్టు 14గేట్లను ఎత్తగా దిగువకు 0.2 టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఏడాది జూలై 1న గేట్లు ఎత్తడం ఆనవాయితీగా వస్తుంది. జులై ఒకటో తేదీ నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి ఉంటాయని ఎస్సారెస్పీ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. మహారాష్ట్రలో బాబ్లిగేట్లు ఎత్తడం వలనశ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వైపు పరుగులు పెడుతున్న గోదావరి వరద నీరు వచ్చి చేరుతోంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్‌ కల్యాణ్‌..ముంబై హాస్పిటల్‌లో ఇప్పటికే వైద్య పరీక్షలు…
  • హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
    అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
  • అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
  • భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.
    భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
  • చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
    తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్‌..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039221
Total views : 194833

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: