Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Devotional బాసరలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

బాసరలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

by Satya
బాసరలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

బాసరలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రోజుకో అవ‌తారంలో భక్తులకు అమ్మ‌వారు ద‌ర్శ‌నం ఇవ్వనున్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శ‌ర‌న్న‌వరాత్రుల‌ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్స‌వాలను క‌నులారా వీక్షించ‌డానికి దేశ న‌లుమూల నుంచి వేలాది భ‌క్తులు హాజ‌రు కానున్నారు. శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ముగ్గురు అమ్మ‌వార్లు కొలువై ఉండడంతో తొమ్మిది రోజుల పాటు ముగ్గురు అమ్మవార్లను దర్శించుకునేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

నవరాత్రి ఉత్సవాలలో అమ్మవార్లకు రాష్ట్ర దేవాదాయ శాఖ తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వడం సంప్ర‌దాయం. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిని, మూడవ రోజు చంద్రగంట, నాల్గవ రోజు కుష్మాండ అవతారం, ఐదవ రోజు స్కంద మాత, ఆరవ రోజు కాత్యాయని అవతారం, ఏడవ రోజు కాలరాత్రి అలంకారం, ఎనిమిదవ రోజు మహా గౌరీ, తొమ్మిద‌వ రోజు సిద్ధ ధాత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవార్లకు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యాన్ని… ఆలయ అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి సమర్పిస్తారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
    కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…
  • కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.
    తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర అంశాలను కమిటీ పరిశీలించినట్లు…
  • రష్యా–ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు.
    రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విస్తృత దాడులు కొనసాగిస్తుండగా.. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగంలోని చమురు, పోర్టు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సుదూర డ్రోన్ దాడులు చేస్తోంది. ఆగస్టు…
  • స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. స్టార్టప్‌ల శక్తి, ఆశయం తనను ఎప్పటిలాగే ముగ్ధుడిని చేశాయని పేర్కొన్నారు. యువ సంస్థల ఆలోచనలు,…
  • పశ్చిమాసియాలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు.
    పశ్చిమాసియాలో యూఎస్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుండగా.. ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదిస్తున్న కొత్త ఆంక్షలను ఎదుర్కొంటామని ప్రకటించింది. మరోవైపు ప్రపంచ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: